Vikram Sugumaran: సినిమా ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం.. బస్సు ఎక్కుతూ ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత.. ఏమైందంటే?

సినిమా ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు విక్రమ్ సుగుమారన్ హఠాన్మరణం చెందారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ అకాల మరణంతో తమిళ సినీ ప్రముఖలు, సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విక్రమ్ మృతికి సంతాపం తెలుపుతున్నారు.

Vikram Sugumaran: సినిమా ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం.. బస్సు ఎక్కుతూ ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత.. ఏమైందంటే?
Vikram Sugumaran

Edited By: TV9 Telugu

Updated on: Sep 04, 2025 | 10:49 AM

మధాయనై కూట్టం, రావణ కొట్టం తదితర చిత్రాలతో కోలీవుడ్ లో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న
విక్రమ్ సుకుమారన్ (48) సోమవారం (జూన్ 2), 2025) తెల్లవారుజామున కన్నుమూశారు. మధురై నుంచి చెన్నైకి వెళ్లేందుకు బస్సు ఎక్కుతండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. విక్రమ్ మరణ వార్త తెలుసుకున్న తమిళ సినీ పరిశ్రమ తీవ్ర సంతాపం తెలిపింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు విక్రమ్ కు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు. డైరెక్టర్ ఆత్మకు శాంతి కలగాలని, ఈ కఠిన సమయంలో విక్రమ్ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని అందించాలంటూ ప్రార్థిస్తూ పోస్టులు పెడుతున్నారు.

విక్రమ్ సుకుమారన్ తమిళ సినిమా చరిత్రలోని ప్రముఖ దర్శకులలో ఒకరు. ఆయన ప్రముఖ దర్శకుడు బాలు మహేంద్ర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతేకాకుండా ఆడుకలం సినిమాకు గానూ దర్శకుడు వెట్రిమారన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా వర్క్ చేశారు. ఆ తర్వాత, విక్రమ్ సుకుమారన్ ‘మధాయనై కూట్టం’ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ప్రముఖ నటుడు భాగ్యరాజ్ కుమారుడు శంతనుతో కలిసి రావణ కొట్టం మూవీని తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కేవలం డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా పొల్లాధవన్, కోడివీరన్ వంటి చిత్రాల్లో కూడా నటించారు. ఇక ఆదివారం (జూన్ 01) తన తదుపరి చిత్రానికి కథను నిర్మాతకు అందించడానికి మధురై వెళ్లాడు. అయితే తిరిగి చెన్నై వెళుతుండగానే విక్రమ్ గుండెపోటుతో కుప్పకూలినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

సినీ ప్రముఖుల నివాళి..

 

ఇవి కూడా చదవండి..

Tollywoood: అప్పుడు బొద్దుగా.. ఇప్పుడు సన్నజాజి తీగలా.. 6 నెలల్లో 55 కిలోలు తగ్గిన హీరోయిన్.. ఎలాగంటే?

Balakrishna: బాలయ్య పక్కన నటించి.. ఆఖరికి ఆ ఇంటికే కోడలిగా వెళ్లిన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?