Annamalai Biopic: సిల్కర్ స్క్రీన్‌పై యంగ్ డైనమిక్ లీడర్..‌ ‘అన్నామలై’ బయోపిక్‌లో ఆ స్టార్ హీరో

|

May 04, 2024 | 8:09 PM

తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై బయోపిక్‌ తెరకెక్కనుందా? ఒక స్టార్ హీరో అన్నామలై పాత్రలో నటించనున్నాడా? ఇప్పటికే దీనికి సంబంధించి కథా చర్చలు పూర్తయ్యాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కరూర్‌కు చెందిన అన్నామలై వ్యవసాయ నేపథ్య కుటుంబం నుండి వచ్చారు. ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. కర్నాటకలో విధులు నిర్వర్తించి డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు

Annamalai Biopic: సిల్కర్ స్క్రీన్‌పై యంగ్ డైనమిక్ లీడర్..‌ అన్నామలై బయోపిక్‌లో ఆ స్టార్ హీరో
BJP leader Annamalai
Follow us on

తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై బయోపిక్‌ తెరకెక్కనుందా? ఒక స్టార్ హీరో అన్నామలై పాత్రలో నటించనున్నాడా? ఇప్పటికే దీనికి సంబంధించి కథా చర్చలు పూర్తయ్యాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కరూర్‌కు చెందిన అన్నామలై వ్యవసాయ నేపథ్య కుటుంబం నుండి వచ్చారు. ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. కర్నాటకలో విధులు నిర్వర్తించి డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగం నుంచి పదవీ విరమణ తీసుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2020లో బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షులయ్యారు. తద్వారా తమిళనాడు రాష్ట్రానికి అతి పిన్న వయస్కుడైన అధ్యక్షులిగా అరుదైన ఘనత సాధించారు. నిజం చెప్పాలంటే తమిళనాడులో బీజేపీ అధ్యక్ష పగ్గాలను అన్నామలై చేపట్టిన తర్వాత ప్రజల్లో ఆ పార్టీకి ఒక గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. పలువురు సినీ ప్రముఖులు బీజేపీలో చేరారు. తమిళనాడులో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి తన శక్తికి మించి అన్నామలై శ్రమిస్తున్నారు.

విశాల్ హీరోగా..

ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో డైనమిక్ పొలిటికల్ లీడర్ ఆయన బయోపిక్‌ను తెరకెక్కించేందుకు తమిళ చిత్ర పరిశ్రమలో సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం . ఇది విన్న సినీ లవర్స్ మరింత ఆసక్తిగా ఉన్నారు. విశేషమేమిటంటే ఈ పాత్రలో తమిళ స్టార్ నటుడు విశాల్ నటించనున్నాడని సమాచారం. ప్రస్తుతం అన్నీ బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నాయని, మరికొద్ది రోజుల్లో అన్నీ ఫైనల్ కానున్నాయని తెలుస్తోంది. అన్నామలై పాత్రకు విశాల్ సరిపోతాడని అభిమానులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తాజాగా విశాల్ కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఉన్నాడు. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. రాజకీయాల్లోకి వచ్చే ముందు అన్నామలై బయోపిక్‌ చేస్తాడా అనేది ఆసక్తిగా మారింది. ఎన్నికల సమయంలో రాజకీయ నేతల బయోపిక్‌లు తీయడం ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది. అన్నామలై విషయంలో కూడా ఇలాగే జరుగుతుందేమో.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.