
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన విడుదల సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పక్కర్లేదు. డైరెక్టర్ వెంట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించగా.. సూరి కీలక పాత్ర పోషించాడు. తమిళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని ఆ తర్వాత తెలుగులోనూ రిలీజ్ చేయగా అదే స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇ పార్ట్ వన్ సూపర్ హిట్ కావడంతో.. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ ప్రకటించారు మేకర్స్. దీంతో పార్ట్ 2 పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా సెకండ్ పార్ట్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ లో.. విజయ్ సేతుపతి చెప్పే కులం మతం అనే డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది. కులమతాల మధ్య ఉండే బేధం.. వాటికి రాజకీయాలు తోడైతే ఎలా ఉంటుందో అన్నది ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది. కులాల మధ్య వ్యత్సాసం .. ఇరు వర్గాల మధ్య వాదన ఎలా ఉంటుంది అన్న పాయింట్ తో ట్రైలర్ అద్భుతంగా చూపించారు. ఇక ఎప్పటిలాగే ఈ సినిమాలో విజయ్ తన నటనతో మరోసారి అదరగొట్టారు.
ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 20న తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.