Vijay Devarakonda: రణవీర్ లాగా మ్యాగజైన్‌కు బోల్డ్ ఫోటోషూట్ ఇస్తారా ?.. కరణ్ ప్రశ్నకు దేవరకొండ షాకింగ్ ఆన్సర్..
మీరు అంతర్జాతీయ మ్యాగజైన్ కోసం న్యూడ్ ( నగ్నంగా) ఫోటోషూట్ చేయడానికి ఇష్టపడతారా ? " అని కరణ్ అడగ్గా.
పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం లైగర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. సౌత్ టూ నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు చిత్రయూనిట్ సభ్యులతో కలిసి ప్రమోషన్లలో పాల్గోంటున్నారు రౌడీ. ఇప్పుడు లైగర్ టీం ముంభైలో సందడి చేస్తోంది. అయితే ఇటీవల విజయ్ ప్రముఖ నిర్మాత కరణ్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోన్న సంగతి తెలిసిందే. ఇందులో రౌడీతోపాటు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే సైతం సందడి చేసింది. ఆ షోలో బోల్డ్ ప్రశ్నలతోపాటు .. వ్యక్తిగత విషయాలు, కెరీర్ గురించి పలు ఆసక్తికర ప్రశ్నలు వేసారు కరణ్. ఈ సందర్భంగా.. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ బోల్డ్ ఫోటోషూట్ గురించి ప్రస్తావించారు.
ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో భాగంగా.. “మీరు అంతర్జాతీయ మ్యాగజైన్ కోసం న్యూడ్ ( నగ్నంగా) ఫోటోషూట్ చేయడానికి ఇష్టపడతారా ? ” అని కరణ్ అడగ్గా.. విజయ్ స్పందిస్తూ.. పర్వలేదు. అలాంటి ఫోటోషూట్ చేయడానికి ఇబ్బందిపడను అంటూ చెప్పుకొచ్చాడు. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ చిత్రంలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 25న విడుదల చేయనున్నారు. ఇక ఈరోజు విడుదలైన విజయ్ లైగర్ యాటిట్యూడ్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.