AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukumar: ఆ స్టార్ హీరో సినిమా కోసం గురువుతో మంతనాలు చేస్తున్న బుచ్చిబాబు..

ఈ ఫోటో నేను తరువాత చేయబోయే నాసినిమాకథ డిస్కషన్ సందర్భంలోది. మాగురువుగారు

Sukumar: ఆ స్టార్ హీరో సినిమా కోసం గురువుతో మంతనాలు చేస్తున్న బుచ్చిబాబు..
Sukumar
Rajitha Chanti
|

Updated on: Jul 29, 2022 | 3:50 PM

Share

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ప్రస్తుతం పుష్ప 2 సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఇండియన్ బాక్సాఫీస్‏ను షేక్ చేసిన పుష్ప మూవీ తర్వాత రాబోయే పుష్ప 2 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా, సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక వచ్చే నెలలో పుష్ప 2 పట్టాలెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా డైరెక్టర్ సుకుమార్, ఆయన శిష్యుడు బుచ్చిబాబు సన కలిసి ముచ్చటిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో పుష్ప 2 మూవీ స్క్రిప్ట్ కోసం సుకుమార్‏కు ఆయన శిష్యుడు సహయం చేస్తున్నాడంటూ టాక్ నడిచింది. పుష్ప 2 స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారని.. అందుకు సుకుమార్ కు బుచ్చిబాబు హెల్ప్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ బుచ్చిబాబు.

తన గురువుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ఆయన సినిమా కోసం డిస్కషన్ చేసే స్థాయి తనకు రాలేదంటూ చెప్పుకొచ్చాడు. “ఈ ఫోటో నేను తరువాత చేయబోయే నాసినిమాకథ డిస్కషన్ సందర్భంలోది. మాగురువుగారు @aryasukku సుకుమార్ Sir నా కోసం నా సినిమా కథ కోసం హెల్ప్ చేయడానికి వచ్చారు. సుకుమార్ Sir సినిమా కథలో కూర్చుని డిస్కషన్ చేసేంత స్థాయి నాకు లేదు రాదు. ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్ప, ఆయనకి ఇచ్చేంత లేదు” అంటూ రాసుకొచ్చారు. అయితే ఉప్పెన సినిమా తర్వాత ఇప్పుడు బుచ్చిబాబు ఎన్టీఆర్ తో ఓ మూవీ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కోసం డైరక్టర్ సుకుమార్ స్క్రీప్ట్ వర్క్ లో హెల్ప్ చేస్తున్నారని క్లారిటీ ఇచ్చేశారు బుచ్చిబాబు.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అంజీరా మజాకా..?ఇలా తిన్నారంటే.. తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం!
అంజీరా మజాకా..?ఇలా తిన్నారంటే.. తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం!
పుల్లగా, కారంగా.. పల్లెటూరి స్టైల్లో చింత చిగురు చికెన్ కర్రీ..
పుల్లగా, కారంగా.. పల్లెటూరి స్టైల్లో చింత చిగురు చికెన్ కర్రీ..
వెల్‌నెస్ ఛాలెంజెస్‌ ఎందుకంత ఫేమస్
వెల్‌నెస్ ఛాలెంజెస్‌ ఎందుకంత ఫేమస్
నడిరోడ్డుపై మహిళ డ్రెస్సును పైకి లేపిన సైకోగాడు దొరికాడు.. పోకిరి
నడిరోడ్డుపై మహిళ డ్రెస్సును పైకి లేపిన సైకోగాడు దొరికాడు.. పోకిరి
సాఫ్ట్‌వేర్ దాటి భౌతిక ప్రపంచంలోకి ఏఐ అడుగు
సాఫ్ట్‌వేర్ దాటి భౌతిక ప్రపంచంలోకి ఏఐ అడుగు
ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో గుండ్రటి రంధ్రం వెనుక ఇంత పెద్ద స్టోరీ
ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో గుండ్రటి రంధ్రం వెనుక ఇంత పెద్ద స్టోరీ
బుల్లెట్ బండి కోసం ఆటో నిండా పైసలతో షోరూమ్‌కు.. అసలు ట్విస్ట్..
బుల్లెట్ బండి కోసం ఆటో నిండా పైసలతో షోరూమ్‌కు.. అసలు ట్విస్ట్..
షుగర్ టెస్ట్ రిపోర్ట్ నార్మల్ గా ఉందా? అయినా ప్రమాదమే
షుగర్ టెస్ట్ రిపోర్ట్ నార్మల్ గా ఉందా? అయినా ప్రమాదమే
అవినీతి చేయనంతవరకు నా ఆటిట్యూడ్ మారదు- ఎంపీ అరవింద్
అవినీతి చేయనంతవరకు నా ఆటిట్యూడ్ మారదు- ఎంపీ అరవింద్
భోపాల్‌లో రామ్ చరణ్ 'పెద్ది కా ఆవాజ్' గ్రాండ్ ఈవెంట్..లైవ్ వీడియో
భోపాల్‌లో రామ్ చరణ్ 'పెద్ది కా ఆవాజ్' గ్రాండ్ ఈవెంట్..లైవ్ వీడియో