
2025 ఏడాది సినిమా సంగీత ప్రపంచంలో ఒక మైలురాయిగా నిలిచింది. అగ్ర తారల సినిమాల్లో విడుదలైన పాటలు మాత్రమే కాకుండా.. అద్భుతమైన సాంగ్స్ సైతం సోషల్ మీడియా ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాయి. భాషతో సంబంధం లేకపోయినా.. కొన్ని మ్యూజిక్స్, హుక్ స్టెప్ప్స్ తెగ వైరల్ అయ్యాయి. ఇన్ స్టాలో రీల్స్, యూట్యూబ్ షార్ట్ వీడియోస్ రూపంలో చాలా పాటలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. కొన్ని పాటలు విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల్ కొద్దీ వ్యూస్ అందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల హృదయాలను కట్టిపడేసిన పాటల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామా. ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాల నుంచి విడుదలైన పాటలు సరిహద్దులు దాటి వైరల్ అయ్యాయి. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్, సంతోష్ నారాయణన్, ఎ.ఆర్. రెహమాన్, జీవి ప్రకాష్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ అందించిన పాటలు ఈ ఏడాదిని మరింత అందంగా మార్చాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమాలోని మోనికా పాట 314 మిలియన్ వ్యూస్ అందుకుని ఈ ఏడాదిలోనే అత్యధిక వ్యూ్స్ అందుకున్న పాటగా అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో అనిరుధ్ మ్యూజిక్, పూజా స్టెప్స్ యువతను ఊర్రూతలూగించింది. అలాగే గోల్డెన్ స్పారో సాంగ్ సైతం యూత్ ను ఆకట్టుకుంది. తమిళంలోని యేడి సాంగ్ సైతం వైరల్ అయ్యింది. ఆ తర్వాత సూర్య నటించిన రెట్రో సినిమాలోని కనిమా పాట, కన్నడి పూవే పాటలు సైతం ఆకట్టుకున్నాయి.
ఇవే కాకుండా తెలుగులో ఏడాది ఆరంభంలోనే వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని గోదారి గట్ట పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీలోని జరగండి జరగండి పాట మాత్రం మాస్ ఆడియన్స్ ను బాగా నచ్చేసింది. అలాగే డాగు మహారాజ్ చిత్రంలోని దబిడి దబిడి సాంగ్.. నా బంగారు కూన పాటలు హిట్టయ్యాయి. ఇవే కాకుండా తండేల్ చిత్రంలోని బుజ్జితల్లి పాట, ఓజీ చిత్రంలోని టైటిల్ సాంగ్ వేరేలెవల్ అనే చెప్పాలి.
ఫైర్ స్టార్మ్, సువ్వి సువ్వి పాటలు ఎక్కువగా వినిపించాయి. ఆంధ్రా కింగ్ సినిమాలోని నువ్వుంటే చాలే, చిన్ని గుండెలో పాటలు ఆకట్టుకున్నాయి. తెలుసు కదా సినిమాలోని నచ్చేసిందే సాంగ్ చార్డ్ బస్టర్ గా నిలిచింది. కోర్ట్ సినిమాలోని కథలెన్నో చెప్పారు సాంగ్ మెప్పించింది. అలాగే లిటిల్ హార్ట్స్ లోని హాలో అని సాంగ్ ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. వైబ్ ఉంది బేబీ.. అదిదా సర్ ప్రైజూ, వైరల్ వయ్యారి, పాటలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇవి కూడా చదవండి : Jabardasth Emmanuel : చాలా వదులుకుని బిగ్బాస్ వరకు.. విన్నర్ కావాల్సినోడు.. ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్ ఎంతంటే..