Duvvada Srinivas: రమ్య మోక్షకు బిగ్‌బాస్ అన్యాయం
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా కళ్యాణ్ పడాల నిలిచాడు, తనూజ రన్నరప్‌గా, డిమాన్ పవన్ సూట్‌కేస్‌తో బయటికొచ్చాడు. అయితే, దువ్వాడ శ్రీనివాస్ రమ్య మోక్షకు అన్యాయం జరిగిందని ఆరోపించాడు. బలమైన కంటెస్టెంట్‌ను తొందరగా పంపించేశారని, రమ్య పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శమని ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, బిగ్ బాస్ అభిమానుల్లో చర్చకు దారితీస్తున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 9 సెక్సెస్ ఫుల్‌గా పూర్తయిపోయింది. 15 వారాల పాటు ప్రేక్షకులను అలరించింది. అందరూ ఊహించినట్టే కామనర్ కళ్యాణ్ పడాల ఈ సీజన్‌లో విన్నర్ గా నిలిచాడు. సీరియల్ నటి తనూజ రన్నరప్ గా నిలిచింది. సెకండ్ రన్నర్‌గా డిమాన్ పవన్ 15 లక్షల సూట్ కేస్‌తో బయటికి వచ్చాడు. ఈక్రమంలోనే జరిగిన గ్రాండ్ ఫినాలేలో.. బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ అందరూ మళ్లీ కలిశారు. హంగామా చేస్తున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం బిగ్ బాస్ పై ఓ కాంట్రో కామెంట్ చేశాడు. బిగ్ బాస్ హౌస్‌లో మాధురికి కాకుండా… ఓ కంటెస్టెంట్‌కు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆరోపించాడు. వైల్డ్ స్ట్రామ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి 5గురు వెళ్లారు. అందులో దివ్వెల మాధురితో పాటు రమ్య మోక్ష కూడా ఉన్నారు. అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రెండో వారంలోనే రమ్య మోక్ష హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ.. రమ్య మోక్షకు అన్యాయం జరిగిందంటూ వీడియోను రిలీజ్ చేశాడు శ్రీనివాస్. ‘రమ్య మోక్షకు బిగ్ బాస్ టీమ్ అన్యాయం చేసింది. రమ్య మోక్ష కష్టపడి పైకి వచ్చిన అమ్మాయి. తన కాళ్ల మీద తాను నిలబడిన ధైర్యవంతురాలు రమ్య మోక్ష. అలాగే బిగ్ బాస్ హౌస్ లో అనవసరమైన వారిని అక్కడ ఎక్కువ రోజులు ఉంచారు. రమ్య లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను తొందరగా పంపించేశారు. ఆ అమ్మాయిని పంపించేయడం బాధాకరమని అన్నారు దువ్వాడ. అంతేకాదు చిన్న చిన్నవాటికి ఆత్మహత్యలకు పాల్పడే యువత రమ్య మోక్ష లాంటి అమ్మాయిని చూసి చాలా నేర్చుకోవాలని, తండ్రి చనిపోయినా ఆ బాధ దిగమింగి ఎలా పోరాడాలో ఆమె నిరూపించిందని చెప్పుకొచ్చారు దువ్వాడ శ్రీనివాస్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆయనకు రూ.50లక్షలు.. ఆమెకు రూ.40 లక్షలు!.. కానీ తనూజకే ఎక్కువ పైసలు
కొడుకుకు రూ.40 లక్షలు.. అమ్మకు రూ.42 లక్షలు!..ఇద్దరికీ జాక్ పాట్
పవన్ , NTR పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు! తప్పక పాటించాల్సిందే
కొడుకు హత్యకు తండ్రి సుపారీ... ఎందుకో తెలిసి పోలీసులే షాక్
ఒక్క గ్రామ పంచాయతీకి ఇద్దరు సర్పంచులా ?? ఇదెక్కడి ట్విస్ట్
ప్రియురాలి పేరుతో ఇల్లు కొని.. తల్లి పేరుతో రిజిస్ట్రేషన్..
శిథిలావస్థకు చేరడంతో బడిగా మారిన గుడి..
వాటి కోసం ఎలుగుబంటిగా మారిన సర్పంచ్.. చివరికి ఏమైందంటే
బాబోయ్.. పాములా కుబుసం విడిచిన మహిళ.. ఇది ఎలా సాధ్యం
ప్రపంచ అద్భుతం.. 160 అంతస్థుల జెడ్డా టవర్

