ఇన్నాళ్ళకు మళ్లీ ఊపేసింది.. ఈ బ్యూటీ దెబ్బకు థియేటర్స్‌లో దుమ్ముదుమారం

ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిన హీరోయిన్స్ లో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటుంటారు కొందరు. కానీ ఈ చిన్నది మాత్రం ఒకే ఒక్క సీన్ తో పాపులర్ అయ్యింది. ఆతర్వాత వరుసగా హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకుంది. ఇక ఇన్నాళ్లకు మరోసారి థియేటర్స్ లో దుమ్మురేపింది.

ఇన్నాళ్ళకు మళ్లీ ఊపేసింది.. ఈ బ్యూటీ దెబ్బకు థియేటర్స్‌లో దుమ్ముదుమారం
Actress

Updated on: Apr 11, 2025 | 6:20 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కొంతమంది భామలకు అదృష్టం కలిసి రాదు. ఎన్ని సినిమాలు చేసినా అవి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం క్రేజీ ఫోటోలు, వీడియోలతో ప్రేక్షకులను కవ్విస్తున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా అంతే.. చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ కానీ అమ్మడి ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే. ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి.. కానీ క్రేజ్ మాత్రం కేక. అప్పుడెప్పుడో ఒక్కసారిగా పాపులర్ అయ్యి యూత్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇప్పుడు మరోసారి తన డాన్స్ తో మెప్పించింది. ఈ బ్యూటీ దెబ్బకు థియేటర్స్ ఈలలు గోలలతో మారుమ్రోగిపోతున్నాయి. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

అప్పట్లో కన్ను కొట్టి ఓవర్ నైట్ లో యూత్ లో ఫాలోయింగ్ పెంచుకుంది ఈ క్రేజీ భామ. అప్పట్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె కనిపించింది ఎవరో కాదు హాట్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. కానీ ప్రియా ప్రకాష్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ అమ్మడు కన్ను కొట్టి క్రేజ్ సొంతం చేసుకుంది అప్పట్లో..

ఇవి కూడా చదవండి

ఆతర్వాత మలయాళంలో వరుసగా సినిమాలు చేసింది. ఇక తెలుగులో నితిన్ హీరోగా నటించిన చెక్ అనే సినిమాతో అడుగు పెట్టింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ మలయాళ సినిమాలతో పాటు తెలుగు, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇక రీసెంట్ గా అజిత్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించింది. ఈ సినిమాలో కీలక పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది. కాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో ప్రియా తన అందాలతో ఆకట్టుకుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ప్రియా ప్రకాష్ అందాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ చిన్నదాని ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. దాంతో ప్రియా ప్రకాష్ వారియర్ పేరు ఎక్స్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె కనిపిస్తుంది.

ప్రియా ప్రకాష్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.