
ప్రస్తుతం వారంలో నాలుగైదు చిత్రాలు విడుదలవుతున్నాయి. భారీ బడ్జె్ట్.. భారీ హైప్ మధ్య సినిమాలు అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. అలాగే చిన్న చిన్న కంటెంట్ చిత్రాలు సైతం థియేటర్లలో సందడి చేస్తున్నాయి. కానీ మీకు తెలుసా.. ? దాదాపు ముప్పై ఏళ్ల క్రితం విడుదలైన ఓ సినిమా ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది. తమిళనాడు ప్రభుత్వం నుంచి 5 అవార్డులు.. 3 జాతీయ అవార్డులు గెలుచుకుంది ఈ మూవీ. జాతీయవాదం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా అప్పట్లో అడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ముప్పై సంవత్సరాలు గడిచినప్పటికీ పాటలు మాత్రం యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు రోజా. 1992లో విడుదలైన ఈమూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా ఇది.
ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?
అరవింద్ స్వామి, మధుబాల, నాజర్, జనగరాజ్ వంటి ప్రముఖులు కీలకపాత్రలు పోషించారు. డైరెక్టర్ కె.బాలచందర్ కవితాలయ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ మూవీలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్. ఇప్పటికీ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. తమిళనాడులోని కడికోడికి చెందిన ఒక మహిళ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందంచారు. జైలుపాలైన భర్తను తిరిగి తీసుకురావడానికి ప్రేమ, ఆప్యాయత, ఆశ .. అలాగే రాజకీయ మలుపులతో ఈ సినిమా సాగుతుంది. ఇందులో మధుబాల అందం, అభినయం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.మొదటి సినిమాతోనే సంగీత దర్శకుడిగా యావత్ దేశాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు ఏఆర్ రెహమాన్.
ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..
రోజా సినిమాలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్. ఇప్పటికీ ఈ పాటలకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా 3 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు ఏఆర్ రెహమాన్. 2005లో ఈ సినిమాలోని సాంగ్స్ టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన 10 ఉత్తమ పాటల జాబితాలో చేర్చారు. అవి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ఈ సినిమా మొత్తం 11 పాటలు గెలుచుకుంది.
ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‌కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..
ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..