AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna : ఇదేం టైటిల్.. అస్సలు బాలేదు.. అతడు నెంబర్ వన్ హీరో ఏంటీ అన్నారు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

సూపర్ స్టార్ కృష్ణ సినీ జీవితం గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలపాటు తెలుగు చలన చిత్రపరిశ్రమలో వరుస హిట్లతో సత్తా చాటిన హీరో.. కానీ ఒకానొక సమయంలో ఆయన కెరీర్ ముగిసింది అనుకున్న సమయంలోనే అందరికీ షాకిస్తూ థియేటర్లను షేక్ చేశారు. ఒక్క సినిమాతోనే అందరి అంచనాలు తారుమారు చేశారు కృష్ణ. ఇంతకీ ఆయన కెరీర్ మలుపు తిప్పిన మూవీ ఏంటో తెలుసుకుందామా.

Krishna : ఇదేం టైటిల్.. అస్సలు బాలేదు.. అతడు నెంబర్ వన్ హీరో ఏంటీ అన్నారు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Krishna Number One Movie
Rajitha Chanti
|

Updated on: Apr 27, 2026 | 6:17 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్ కృష్ణ స్థానం సుస్థిరం. దశాబ్దాలపాటు సినీరంగాన్ని ఏలిన కృష్ణ.. 1990ల ప్రారంభంలో ఆయన కెరీర్ కొంత ఒడిదుడుకులకు లోనైంది. ఇక కృష్ణ పని అయిపోయిందని, ఆయన యుగం ముగిసిందని విమర్శకులు భావిస్తున్న తరుణంలో, 1994 సంక్రాంతి కానుకగా వచ్చిన ‘నెంబర్ వన్’ చిత్రం అందరి నోళ్లు మూయించింది. ఈ సినిమా కృష్ణకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ చిత్ర విజయానికి ప్రధాన సూత్రధారి దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి. కృష్ణకు వీరాభిమాని అయిన ఆయన, తన అభిమాన హీరోను వెండితెరపై ఎలా చూడాలనుకున్నారో అలాగే ఈ చిత్రాన్ని మలిచారు. కృష్ణ స్టైల్, కాస్ట్యూమ్స్, లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమాలో కృష్ణ ఒక సీన్‌లో వేసిన డ్రెస్ మళ్ళీ మరో సీన్‌లో వేయలేదంటే ఆయన లుక్ కోసం ఎంత ఖర్చు చేశారో అర్థం చేసుకోవచ్చు. 50 ఏళ్ల వయసులో కూడా కృష్ణ ఈ సినిమాలో పాతికేళ్ల యువకుడిలా కనిపించి అభిమానులను అలరించారు. కృష్ణారెడ్డి ఈ చిత్రంలో కృష్ణతో రకరకాల గెటప్స్ వేయించారు. అర్జునుడు, ఛత్రపతి శివాజీ, చార్లీ చాప్లిన్, రోమన్ యోధుడు ,రాజు వంటి విభిన్న పాత్రలలో కృష్ణ కనిపించి మెప్పించారు. ఈ వైవిధ్యం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Babloo Prithiveeraj : హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు.. దెబ్బకు సినిమా రిజల్ట్ మారిపోయింది.. నటుడు పృథ్వీరాజ్..

1994 సంక్రాంతి పోటీ చాలా తీవ్రంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ముగ్గురు మొనగాళ్లు’, కింగ్ నాగార్జున నటించిన ‘గోవిందా గోవిందా’ వంటి భారీ చిత్రాలు పోటీలో ఉన్నాయి. అయితే, ఈ రెండు చిత్రాలను కాదని ప్రేక్షకులు ‘నెంబర్ వన్’ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. చిరు, నాగ్ సినిమాలను వెనక్కి నెట్టి, ఆ ఏడాది సంక్రాంతి విజేతగా కృష్ణ నిలిచారు. ఈ చిత్రంలో కృష్ణ సరసన సౌందర్య తొలిసారిగా నటించింది. కోట శ్రీనివాసరావు కామెడీ విలనిజం, మహేష్ ఆనంద్ శాడిస్ట్ పాత్ర, బ్రహ్మానందం కామెడీ హైలైట్‌గా నిలిచాయి. చిత్రానికి టైటిల్ ‘నెంబర్ వన్’ అని పెట్టినప్పుడు విమర్శలు వచ్చినా, సినిమా విడుదలయ్యాక కృష్ణ నిజంగానే ‘నెంబర్ వన్’ అని నిరూపించుకున్నారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, సౌందర్య జోడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కెరీర్ ముగిసిపోయిందని అనుకున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి మరోసారి హీరోగా తనను తాను నెంబర్ వన్ హీరోగా నిరూపించుకున్నారు. ఇక కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించి అప్పట్లోనే చరిత్ర సృష్టించారు. ముఖ్యంగా ఒకే ఏడాదిలో 18 సినిమాల్లో నటించారు.

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..

ఒక సంవత్సరంలోనే 18 సినిమాలు చేయడం ఆయన కెరీర్ లోనే ఒక రికార్డు. 1972లో ఒక్క ఏడాదిలోనే ఈ చిత్రాలన్ని విడుదలై భారీ విజయాన్ని సాధించాయి. అప్పట్లో సరికొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ సూపర్ స్టార్ కృష్ణ. 1964లో ‘తేనెమనసులు’ సినిమాతో కథానాయకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. దాదాపు 5 దశాబ్దాలపాటు తన నటనతో ప్రేక్షకులను అలరించారు. తెలుగు సినిమాకి సరికొత్త సాంకేతికతలను పరిచయం చేసిన ఘనత ఆయనది. ఇప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Raviteja : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. రవితేజ..

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..

Follow Us