Actress : అప్పుడు యాక్టింగ్ రాదని హేళన.. ఇప్పుడు గుండెల్లో గుడి కట్టారు.. ఒక్క ఏడాదిలోనే 7 బ్లాక్ బస్టర్స్..

టీనేజ్ లోనే నటిగా తెరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది. ఆమె సౌత్ ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తన కెరీర్ అత్యుత్తమ స్థాయిలో ఉన్నప్పుడే క్రేజ్ హీరోయిన్లకు ధీటుగా ఒక్క ఏడాదిలోనే 7 సినిమాల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేసింది.

Actress : అప్పుడు యాక్టింగ్ రాదని హేళన.. ఇప్పుడు గుండెల్లో గుడి కట్టారు.. ఒక్క ఏడాదిలోనే 7 బ్లాక్ బస్టర్స్..
Anupama

Updated on: Nov 23, 2025 | 3:32 PM

ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తక్కువ సమయంలోనే అందం, అభినయంతో మెప్పించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తారల గురించి చెప్పక్కర్లేదు. అయితే కెరీర్ మొదట్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న అమ్మాయిలు.. ఇప్పుడు వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్.. ఒక్క ఏడాదిలోనే దాదాపు 7 బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. కెరీర్ ప్రారంభంలో అనేక విమర్శలు ఎదుర్కొంది. మొదటి సినిమా తర్వాత ఆమెకు యాక్టింగ్ రాదని హేళన చేశారు. ఇప్పుడేం గుండెల్లో గుడి కట్టారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.

మలయాళంలో ప్రేమమ్ సినిమాతో తెరంగేట్రం చేసింది. కేరళలోని త్రిస్సూర్ ప్రాంతానికి చెందిన అనుపమ.. 2015లో విడుదలైన ప్రేమమ్ సినిమాతో నటిగా సినీప్రయాణం స్టార్ట్ చేసింది. అప్పుడు ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. ఇందులో మేరీ అనే అమ్మాయిగా కనిపించింది. అప్పట్లో ఆమె యాక్టింగ్ బాలేదంటూ ఎన్నో విమర్శలు వచ్చాయట. తన గురించి విమర్శలకు ఎంతో బాధపడ్డానని గుర్తుచేసుకుంది. ఇక తర్వాత తమిళంలో ధనుష్ సరసన కోడి చిత్రంలో నటించింది. తెలుగులో అఆ సినిమాతో తెరంగేట్రం చేసిన అనుపమ..తర్వాత శతమానం భవతి మూవీతో హీరోయిన్ గా అందరిని మెప్పించింది.

ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకున్న అనుపమ.. మలయాళంలో మాత్రం ప్రేమమ్ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు చాలా కాలం తర్వాత ఇటీవలే జానకి వర్సెస్ ది కేరళ స్టేట్ చిత్రంలో కనిపించింది. నిజానికి తెలుగులో వరుస సినిమాలతో అలరించింది. ఒక్క ఏడాదిలోనే దాదాపు 3, 4 చిత్రాల్లో కనిపించింది. దాదాపు పదేళ్ల తర్వాత ఈ ఏడాది సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆమె ఈ సంవత్సరం డ్రాగన్, బైసన్, ది పెట్ డిటెక్టివ్, జానకి వర్సెస్ ది స్టేట్ ఆఫ్ కేరళ, కిష్కిందపురి, భరత వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..

ఇప్పుడు అనుపమ నటిస్తూన్న లాక్ డౌన్ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. కోవిడ్ 19 లాక్ డౌన్ నేపథ్యంలో సాగే ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం ఒక్క అవకాశం రావాలని ఎదురుచూస్తున్న హీరోయిన్లలో.. ఒక్క ఏడాదిలోనే దాదాపు 7 సినిమాల్లో నటించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది అనుపమ.

ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?

ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..

Follow Us