Tollywood: ఇండస్ట్రీలోకి వచ్చి 8 ఏళ్లు.. ఇప్పటివరకు లిప్‏లాక్ సీన్ చేయని స్టార్ హీరోయిన్… సాయి పల్లవి మాత్రం కాదండోయ్.

ఇప్పుడిప్పుడే హీరోయిన్ మృణాల్ సైతం గ్లామర్ రోల్స్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చి 8 ఏళ్లైనా ఇప్పటివరకు ఒక్క లిప్ లాక్ చేయలేదు. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నా.. రెండవ సినిమాతో ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది. ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా సినీ ప్రియులకు దగ్గరైంది.

Tollywood: ఇండస్ట్రీలోకి వచ్చి 8 ఏళ్లు.. ఇప్పటివరకు లిప్‏లాక్ సీన్ చేయని స్టార్ హీరోయిన్... సాయి పల్లవి మాత్రం కాదండోయ్.
Actress
Follow us

|

Updated on: Jul 02, 2024 | 3:30 PM

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా తనకంటూ ఓ గుర్తింపు రావాలంటే కచ్చితంగా గ్లామర్ రోల్స్ చేయాల్సిందే. నో రొమాంటిక్ సీన్స్ అంటూ రూల్స్ పెట్టుకుంటే మాత్రం ఆఫర్స్ అంతగా రావనేది ఇప్పుడు సినీరంగుల ప్రపంచంలో వినిపిస్తున్న మాట. అందుకే ఇన్నాళ్లు ట్రెడిషనల్ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్.. ఇప్పుడు గ్లామర్ రోల్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో సంప్రదాయంగా బొద్దుగా కనిపించే రాశీ ఖన్నా ఇప్పుడు హిందీ మూవీ కోసం రూల్స్ బ్రేక్ చేసింది. అలాగే ఇప్పుడిప్పుడే హీరోయిన్ మృణాల్ సైతం గ్లామర్ రోల్స్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చి 8 ఏళ్లైనా ఇప్పటివరకు ఒక్క లిప్ లాక్ చేయలేదు. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నా.. రెండవ సినిమాతో ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది. ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా సినీ ప్రియులకు దగ్గరైంది. తనే హీరోయిన్ కీర్తి సురేష్. తొలి సినిమా నేను శైలజ మూవీతో తెలుగు తెరకు పరిచయమై యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

ఇక మహానటి సినిమాతో సావిత్రి పాత్రలో అద్భుతమైన నటన కనబర్చి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకుంది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కీర్తి కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాగా నిలిచింది మహానటి. తెలుగులో అరడజనుకు పైగా సినిమాల్లో నటించింది. అయితే కీర్తి నటనకు.. ప్రతిభకు సరైన పాత్రలు, అవకాశాలు రావడం లేదనే విషయం తెలిసిందే. చాలా కాలంపాటు వరుసగా హిట్స్ అందుకుంటున్న కీర్తి.. దసరా సినిమాతో ఒక్కసారిగా బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రంలో పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కీర్తి యాక్టింగ్ అద్భుతమనే చెప్పాలి. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు కీర్తికి గ్లామర్ రోల్స్ మాత్రం రాలేదు. అంతేకాదు.. ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా లిప్ లాక్ సీన్ చేయలేదు. గతంలో నితిన్ హీరోగా నటించిన ఓ ప్రాజెక్టులో లిప్ లాక్ సీన్ ఉండడంతో వెంటనే ఆఫర్ వదిలేసిందట. ఇక ఆ తర్వాత రెండేళ్లకు వీరిద్దరి ఖాతాలో రంగ్ దే సినిమా వచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కీర్తి బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. బీటౌన్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి లిప్ లాక్ సీన్ చేయనుందనే టాక్ వినిపిస్తుంది. కానీ ఇందులో ఎంతవరకు నిజముందనేది మాత్రం తెలియరాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? కొవ్వును వెన్నలాకరిగించాలంటే
అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? కొవ్వును వెన్నలాకరిగించాలంటే
తప్పతాగి.. పిచ్చి పిచ్చిగా చేసి.. నెట్టింట హీరోయిన్ వీడియో వైరల్
తప్పతాగి.. పిచ్చి పిచ్చిగా చేసి.. నెట్టింట హీరోయిన్ వీడియో వైరల్
బిగ్ బాస్ 8లోకి ముగ్గురు.. ఇక షో దబిడి దిబిడే
బిగ్ బాస్ 8లోకి ముగ్గురు.. ఇక షో దబిడి దిబిడే
గుడ్ న్యూస్.. తెరపైకి వస్తున్న జూనియర్ లయన్‌
గుడ్ న్యూస్.. తెరపైకి వస్తున్న జూనియర్ లయన్‌
ఈసీజన్‌లో రోజుని హెర్బల్‌టీతో ప్రారంభించండి అనేక ఆరోగ్యప్రయోజనాలు
ఈసీజన్‌లో రోజుని హెర్బల్‌టీతో ప్రారంభించండి అనేక ఆరోగ్యప్రయోజనాలు
ఇకపై నా కొడుకు వస్తాడు.. వారసుడిని రంగంలోకి దించిన లారెన్స్‌
ఇకపై నా కొడుకు వస్తాడు.. వారసుడిని రంగంలోకి దించిన లారెన్స్‌
రోజుకు రూ.100 కోట్లు.. మొత్తంగా చూస్తే.. కుప్పలుగా కోట్లలో డబ్బుల
రోజుకు రూ.100 కోట్లు.. మొత్తంగా చూస్తే.. కుప్పలుగా కోట్లలో డబ్బుల
బెదిరించి తీసుకువెళ్లాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన యువతి
బెదిరించి తీసుకువెళ్లాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన యువతి
మాంసాహారం లేనిదే ముద్ద దిగదా..! ఈ సీజన్‌లో ఈ ఆహారం తినొద్దు
మాంసాహారం లేనిదే ముద్ద దిగదా..! ఈ సీజన్‌లో ఈ ఆహారం తినొద్దు
కంగనాను కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‏కు ఊహించని షాక్..
కంగనాను కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‏కు ఊహించని షాక్..