AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అప్పుడు ఇండస్ట్రీని అల్లాడించేసింది.. 7 సంవత్సరాలుగా సినిమాలకు దూరం.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు సినీరంగంలో తోపు హీరోయిన్. స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె.. 7 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఆమె ఆస్తులు రూ.332 కోట్లు. అలాగే ఆమె జాతీయ అవార్డ్ గ్రహీత. ఇప్పుడు ఆమె రూ.100 కోట్ల బంగ్లాలో నివసిస్తుంది. అలాగే ఇప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood : అప్పుడు ఇండస్ట్రీని అల్లాడించేసింది.. 7 సంవత్సరాలుగా సినిమాలకు దూరం.. అయినా తగ్గని క్రేజ్..
Rekha
Rajitha Chanti
|

Updated on: Dec 03, 2025 | 8:48 AM

Share

సినీ పరిశ్రమలో హీరోయిన్లుగా తమదైన ముద్ర వేసిన తారలు చాలా మంది ఉన్నారు. అందులో ఈ నటి ఒకరు. ప్రస్తుతం ఆమె వయసు 71 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. అలాగే దాదాపు 7 సంవత్సరాలుగా ఏ సినిమాలోనూ నటించలేదు. ఇప్పుడు ఆమె ఆస్తులు రూ.332 కోట్లు ఉన్నాయి. అలాగే 100 కోట్ల విలువైన ఇంటిలో నివసిస్తుంది. ఆమె నటించకపోయినా డబ్బు మాత్రం సంపాదిస్తూనే ఉంది. ఆమె ఎవరో తెలుసా.. ? తనే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేఖ. 1954లో దివంగత నటుడు జెమిని గణేషన్, పుష్పవల్లి దంపతులకు జన్మించారు. ఆమె 200లకు పైగా సినిమాల్లో నటించారు. అలాగే ఉత్తమ నటిగా జాతీయ అవార్డుతోపాటు అనేక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. 2010లో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 1958లో ఇంటి గుట్టు సినిమాతో తెలుగులో బాలనటిగా అరంగేట్రం చేసింది.

ఇవి కూడా చదవండి : Mogalirekulu : ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. మొగలి రేకులు సీరియల్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..

1969లో ఆపరేషన్ జాక్ పాట్ సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. హిందీ, తెలుగు భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. 1982 ఉమ్రాన్ జాన్ చిత్రానికి రేఖ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది. 2018 నుంచి ఆమె సినిమాల్లో నటించడం లేదు. ప్రస్తుతం ఆమె ఆస్తులు రూ.332 కోట్లు. అలాగే ముంబైలోని బాంద్రా ప్రాంతంలో రూ. 100 కోట్ల విలువైన బంగ్లాలో ఆమె నివసిస్తుంది. రేఖ వద్ద రోల్స్ రాయిస్ ఘోస్ట్ (రూ. 6 కోట్లు), రూ. 2.17 కోట్ల విలువైన మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్, ఆడి A8 (రూ. 1.63 కోట్లు), మరియు బిఎమ్‌డబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ – రూ. 2.03 కోట్లు లగ్జరీ కార్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :  Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..

రేఖ అవార్డు షోలు, రియాల్టీ షోలలో ప్రత్యేక అతిథిగా హాజరుకావడానికి లక్షలు వసూలు చేస్తుంది. అలాగే ప్రకటనల బ్యానర్స్ పై తన ఫోటోను ప్రదర్శించడానికి ఆమె రూ.10 లక్షలు వసూలు చేస్తుంది. రేఖకు ఇప్పటికీ భారీ ఫాలోయింగ్ ఉంది.

ఇవి కూడా చదవండి : Actor : ఒకప్పుడు మామిడి కాయలు అమ్మాడు.. ఇండస్ట్రీలోనే టాప్ నటుడు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..

Rekha News

Rekha News

ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..