Tollywood : 10 ఏళ్లకే ఎంట్రీ.. 20 ఏళ్లకే ఇండస్ట్రీని ఏలేసింది.. చివరకు 36 ఏళ్లకే మరణం..

చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ గా మారింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. స్టార్ హీరోలతో నటించి ఇండస్ట్రీని ఏలేసింది. కానీ అనారోగ్య సమస్యలతో 36 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఇప్పటికీ సినీప్రియుల మదిలో చెరగని ముద్ర వేసిన హీరోయిన్ ఆమె. ఇంతకీ ఎవరో తెలుసా.. ? ఆమె నిజ జీవితం ఎన్నో ఒడిదుకులతో సాగింది.

Tollywood : 10 ఏళ్లకే ఎంట్రీ.. 20 ఏళ్లకే ఇండస్ట్రీని ఏలేసింది.. చివరకు 36 ఏళ్లకే మరణం..
Madhubala

Updated on: May 17, 2025 | 4:01 PM

పదేళ్లకే సినీరంగంలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. కథానాయికగా దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించింది. చిన్న వయసులోనే స్టార్ హీరోల సరసన నటించి అగ్ర కథానాయికగా మారి ఇండస్ట్రీని ఏలేసింది. బాల్యంలో ఎన్నో కష్టాలను అనుభవించిన ఈ భామ.. హీరోయిన్ అయ్యాక మానసిక సంఘర్షణకు గురైంది. భర్తతో విబేధాలు, డివోర్స్.. అనారోగ్య సమస్యలు ఆమెను మరింత కృంగదీశాయి. చివరకు 36 ఏళ్లకే మరణం ఆమె చెంత చేరింది. అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈహీరోయిన్ మరణం ఇప్పటికీ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మధుబాల. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఐకానిక్. తరాలు మారినా మూవీ లవర్స్ కు ఇష్టమైన హీరోయిన్.

సినీరంగుల ప్రపంచంలో నటిగా ఓ వెలుగు వెలిగింది. కానీ వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఒడిదుడుకులకు గురైంది. 1950ల్లో ఆమె టాప్ హీరోయిన్. దాదాపు 20 ఏళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసింది. దాదాపు 70కి పైగా చిత్రాల్లో నటించింది. 1933 ఫిబ్రవరి 14న ఢిల్లీలో జన్మించిన మధుబాల అసలు పేరు ముంతాజ్ జెహాన్ బేగం దెహ్లావి. చిన్నప్పుడే పేదరికంతో ఇబ్బంది పడింది. తండ్రి ఉద్యోగం పోవడంతో కుటుంబం మొత్తం ముంబై వచ్చారు. అప్పుడే మధుబాలను ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారు. మొదటి సినిమాకు మధుబాల రెమ్యునరేషన్ రూ.150. ఆ త్రవాత ఆమె పేరును నటి దేవికా రాణి మధుబాలగా మార్చారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత హీరో దిలీప్ కుమార్ తో ప్రేమలో పడింది. కానీ కొన్నాళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. చివరకు తన తండ్రి వైపే మధుబాల ఉండడంతో ఆమెతో బంధాన్ని కాదనుకున్నారు దిలీప్ కుమార్. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ సింగర్ కిషోర్ కుమార్ ను పెళ్లి చేసుకుంది. కానీ చిన్నప్పటి నుంచే ఆమెకు గుండె సమస్య ఉందనే విషయం దాచడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. కొన్నాళ్లకు అనారోగ్య సమస్యలతో 36 ఏళ్ల వయసులోనే మరణించింది మధుబాల.

Madhubala Pic

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..