Tollywood: ఒకప్పుడు పర్సనాలిటీపై ట్రోలింగ్.. అందరి హృదయాలు గెలుచుకున్న హీరో.. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరంటే..

|

Jul 24, 2024 | 8:25 AM

మలయాళీ సినీరంగంలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న ఈ నటుడికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోగానే కాకుండా విలన్ గా మెప్పిస్తున్నాడు. కానీ ఒకప్పుడు అతడి పర్సనాలిటీపై దారుణంగా ట్రోల్ చేశారు. అతడి కటౌట్, లుక్స్ చూసి అసలు హీరోగా సెట్ అవ్వడంటూ విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అనేక సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. అలాగే సూపర్ స్టార్స్ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ సూపర్ స్టార్ గా ఎదిగాడు.

Tollywood: ఒకప్పుడు పర్సనాలిటీపై ట్రోలింగ్.. అందరి హృదయాలు గెలుచుకున్న హీరో.. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరంటే..
Actor
Follow us on

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో కమ్ సూపర్ డైరెక్టర్. హీరోయిజం సినిమాలు కాకుండా మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మలయాళీ సినీరంగంలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న ఈ నటుడికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోగానే కాకుండా విలన్ గా మెప్పిస్తున్నాడు. కానీ ఒకప్పుడు అతడి పర్సనాలిటీపై దారుణంగా ట్రోల్ చేశారు. అతడి కటౌట్, లుక్స్ చూసి అసలు హీరోగా సెట్ అవ్వడంటూ విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అనేక సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. అలాగే సూపర్ స్టార్స్ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ సూపర్ స్టార్ గా ఎదిగాడు. అతడే హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మెప్పిస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో దర్శకుడిగా, నటుడిగా, హీరోగా రాణిస్తున్నాడు.

ఆస్ట్రేలియాలోని టాస్మానియాలోని ఒక విశ్వవిద్యాలయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాస్టర్స్ కంప్లీట్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్.. రంజిత్ దర్శకత్వం వహించిన నందనం సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ ముందుగా డైరెక్టర్ ఫాజిల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సింది. ఆ మూవీకి సంబంధించిన స్క్రీన్ టెస్ట్ కూడా జరిగింది.. కానీ అనుకోకుండా ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. దీంతో పృథ్వీరాజ్ పేరును డైరెక్టర్ రంజిత్ కు సిఫార్స్ చేశాడు దర్శకుడు ఫాజిల్. మలయాళ ఇండస్ట్రీలో మొదట్లో చిన్న సినిమాలతో అరంగేట్రం చేసిన పృథ్వీరాజ్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. కెరీర్ ప్రారంభంలో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన పృథ్వీరాజ్.. 2005లో కెవీ ఆనంద్ దర్శకత్వం వహించిన కనా కాండన్ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాతోనే తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. క్లాస్ మేట్స్, వాస్తవం, చాక్లెట్ వంటి చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు.

హీరోగా ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నప్పటికీ చాలాకాలం వరకు పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్స్, పర్సనాలిటీపై అనేక విమర్శలు వచ్చాయి. అలాగే సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్స్ ఎదుర్కొన్నాడు. అతడిని అహంకారి అని.. అసలు హీరోగా సెట్ కాలేదు అంటూ విమర్శలు వచ్చినప్పటికీ.. ఆత్మస్థైర్యంతో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. సెల్యులాయిడ్ చిత్రానికి ఉత్తమ నటుడిగా, కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు, కావ్య తలైవన్ సినిమాకు ఉత్తమ విలన్‌గా, మొదటి తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు అందుకున్నారు. ఇటీవల డ్రైవింగ్ లైసెన్స్, అయ్యప్పనుమ్ కోషియుమ్, ఆడుజీవితం వంటి హిట్స్ అందుకున్న పృథ్వీరాజ్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం సలార్ 2 చిత్రంలో నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.