Actor : జిమ్ లేదు.. వర్కవుట్స్ లేవు.. 55 ఏళ్ల వయసులో బరువు తగ్గిన హీరో..

ప్రస్తుతం సినిమా ప్రపంచంలో స్టార్ హీరోహీరోయిన్స్ తమ ఫిట్‌నెస్ లుక్ పై ఎంత శ్రద్ధ తీసుకొంటున్నారో తెలిసిందే. 60, 50 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల నటీనటులుగా కనిపిస్తున్నారు. తమ ఫిట్‌నెస్ లుక్ కోసం కఠినమైన వర్కవుట్స్, నిత్యం డైట్ ఫాలో అవుతుంటారు. కానీ ఓ హీరో మాత్రం ఎలాంటి జిమ్ లేకుండానే 21 రోజుల్లో బరువు తగ్గారు.

Actor : జిమ్ లేదు.. వర్కవుట్స్ లేవు.. 55 ఏళ్ల వయసులో బరువు తగ్గిన హీరో..
Madhavan

Updated on: Sep 17, 2025 | 10:09 PM

భారతీయ సినీప్రియులకు పరిచయం అక్కర్లేని హీరో మాధవన్. అసలు పేరు రంగనాథన్ మాధవన్. సఖి సినిమాతో దక్షిణాదిలో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. రెహ్నా హై టెర్రే దిల్ మే నుండి రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ అనేక చిత్రాల్లో అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకున్నారు. 55 ఏళ్ల వయసులో, ఈ నటుడు తన నటనలోనే కాకుండా తన ఫిట్‌నెస్ లుక్ తోనూ ఆశ్చర్యపరుస్తున్నాడు. వ్యాయామాలు, క్రాష్ డైట్‌లు లేకుండా సులభంగా బరువు తగ్గారు. రాకెట్రీ చేసిన తర్వాత మాధవన్ తన జీవనశైలిని మార్చుకున్నానని, ఇది కేవలం మూడు వారాల్లోనే బరువు తగ్గడానికి సహయపడిందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..

ఇవి కూడా చదవండి

సాయంత్రం 6:45 తర్వాత అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం మానేశాడు. శరీరం రాత్రిపూట విశ్రాంతి తీసుకోవడానికి, సమర్ధవంతంగా జీర్ణం కావడానికి వీలు కల్పించింది, బరువు తగ్గడానికి సహయపడింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత, అతను పచ్చి ఆహార పదార్థాలను పూర్తిగా మానేశాడు. ఆకుపచ్చ కూరగాయలు తీసుకున్నాడు. మాధవన్ వ్యాయామాలను ఉదయం పూట ఎక్కువసేపు నడవడానికి మార్చాడు.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ద్రవేళకు కనీసం 90 నిమిషాల ముందు స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, త్వరగా నిద్రపోవడం వంటి అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అతను బాగా హైడ్రేటెడ్ గా ఉండి, గట్ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకున్నాడు.

Madhavan Movie S

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..