AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సోషల్ మీడియాలో వైరలవుతున్న ఛీ ఛీ ఛీ రే నాని పాట వెనుక ఇంత విషాదం ఉందా.. ?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే అసలు చెప్పక్కర్లేదు. కొన్ని రోజులుగా నెట్టింట పాత పాటలు, పాత సినిమా సీన్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఛీఛీఛీ రే నాని సాంగ్ ఒకటి. ఇప్పుడు యూట్యూబ్, ఇన్ స్టా ఎక్కడ చూసిన ఇదే పాట వినిపిస్తుంది.

Tollywood: సోషల్ మీడియాలో వైరలవుతున్న ఛీ ఛీ ఛీ రే నాని పాట వెనుక ఇంత విషాదం ఉందా.. ?
Chhi Chhi Chhi Re Nani
Rajitha Chanti
|

Updated on: Feb 03, 2025 | 10:48 AM

Share

ప్రస్తుతం యూట్యూబ్, ఇన్ స్టాలో ఓ సాంగ్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. భాష అర్థం కాకపోయినా.. ఆ సాంగ్ వైబ్ కు అందరూ అట్రాక్ట్ అవుతున్నాయి. అదే ఛీ ఛీ ఛీ రే నాని.. సాంగ్. దాదాపు దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ సాంగ్ భాష అర్థం కాకపోయినా.. మ్యూజిక్ నెటిజన్లను అలరిస్తుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ పాటకు తమ స్టైల్లో స్టెప్పులేస్తున్నారు. హీరోహీరోయిన్ బాధతో ఏడుస్తూ ఈ సాంగ్ పాడుతూ ఉంటారు. కానీ ఆ సాంగ్ ఏ భాషలో పాడుతున్నాడో.. ఏం పాడుతున్నాడో అనేది ఎవరికీ అర్థం కాలేదు. అయితే వారిద్దరి ఎక్స్ ప్రెషన్స్ బట్టి చూస్తే ఇది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అని తెలుస్తోంది. దీంతో ఈ పాటను లవ్ ఫెయిల్యూర్, లేదా సరదాగా ఫన్నీగా రీల్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ పాటలో కనిపించిన నటీనటులను ఇప్పుడు యూట్యూబర్స్ ఇంటర్వ్యస్ చేస్తున్నారు. ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియురాలి గురించి ఈ పాట సాగుతుందని తెలుస్తోంది. ఈ పాటను ఇప్పుడు తమిళంలోకి డబ్ చేయడంతో మరింత వైరలవుతుంది. ఎలాంటి స్నేహితురాలు మోసం చేస్తుంది? ఈతరం అమ్మాయిల వెర్షన్ సైతం ట్రెండింగ్ లో ఉంది. ప్రియురాలు మోసం చేయడంతో బాధతో ప్రియుడు పాడే సాంగ్ ఇది. ఈ పాటను సత్య నారాయణన్ అనే న్యాయవాది ఒడిశాలోని కోరాట్‌పుట్ ప్రాంతంలో గిరిజనుల చుట్టూ పుట్టి పెరిగిన ఒడిషా సంస్కృతిని, ప్రాచీన జానపద సంగీతాన్ని ప్రచారం చేయడంలో కీలకపాత్ర పోషించారు.1992లో వచ్చిన ‘బలిబుల్’లోని 8 పాటల్లో ‘ఛీ ఛీ ఛీ రే నాని’ ఒకటి. ఇందులో బిబూతి బిస్వాల్, శైలజా పటేల్ నటించారు.

2012లో సత్యనారాయణ మరణించిన తర్వాత, సిద్ధార్థ్ సంబల్‌పురి యూట్యూబ్ ఛానెల్‌లో ఆరేళ్ల క్రితం పాట అప్‌లోడ్ చేశారు. అయితే ఈ ట్రెండింగ్ సాంగ్‌ని చూసేందుకు ఈ పాటను రూపొందించిన సత్య నారాయణన్ ఈరోజు లేరు. కానీ ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన