సంక్రాంతి పండగ సందర్భంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా డాకు మహారాజ్. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాకు డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు తమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలం. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే విశేష స్పందన వస్తుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య మరోసారి నటవిశ్వరూపం చూపించారు. అలాగే ఇందులో తనదైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఓ చిన్నారి.
ఈ చిత్రంలో వైష్ణవి అనే చిన్నారి పాత్రలో అద్బుతమైన నటనతో మెప్పించింది. ఈ సినిమాలో వైష్ణవి పాత్రలో కనిపించిన అమ్మాయి పేరు వేద అగర్వాల్. ఆ చిన్నారి కనిపించిన ప్రతి సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ అమ్మాయి సింగర్. నటిగా ఇన్ స్టాలో 31000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నాయి. ఆగ్రాకు చెందిన వేద అగర్వాల్ ఫ్యామిలీ హైదరాబాద్ లో స్థిరపడ్డారట. ప్రస్తుతం ఆ చిన్నారి వయసు 8 సంవత్సరాలు. అంతకు ముందు గాండీవధారి అర్జున సినిమాలోనూ చిన్న పాత్ర పోషించింది. అలాగే సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రంలోనూ నటిస్తున్నట్లు సమాచారం. డాకు మహారాజ్ షూటింగ్ చివరి రోజున వేద అగర్వాల్ ఎమోషనల్ అయిన వీడియో నెటిజన్లను భావోద్వేగానికి గురి చేసింది.
ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. దీంతో తెలుగులో వేదకు మరిన్ని ఆఫర్స్ రానున్నట్లు తెలుస్తోంది..ఈ సినిమాలో బాలయ్యతోపాటు తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది వేద. ప్రస్తుతం థియేటర్లలో డాకు మహారాజ్ మూవీ పాజిటివ్ రివ్యూలతో దూసుకుపోతుంది.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..