AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sathyadev: సత్యదేవ్ చేయాల్సిన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన విశ్వక్ సేన్.. ఎలా మిస్సైందంటే..

సత్యదేవ్.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయి.. ఇప్పుడు సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సినీ ప్రియులను అలరిస్తున్నారు. ఇటీవలే కింగ్డమ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

Sathyadev: సత్యదేవ్ చేయాల్సిన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన విశ్వక్ సేన్.. ఎలా మిస్సైందంటే..
Sathyadev, Vishwak Sen
Rajitha Chanti
|

Updated on: Aug 12, 2025 | 10:04 PM

Share

సాధారణంగా సినీరంగంలో ఒక స్టార్ హీరో చేయాల్సిన సినిమా మరొకరి చేతుల్లోకి వెళ్లిపోతుంది. కొన్నిసార్లు ఒకరి ఖాతాలో పడాల్సిన హిట్టు, ఫ్లాపులు మరొకరి ఖాతాల్లో పడతాయి. ఒక హీరోను ఊహించుకుని రాసిన కథ.. చివరకు మరొకరితో చేస్తుంటారు. తాజాగా హీరో సత్యదేవ్ సైతం ఓ సూపర్ హిట్ మూవీని మిస్సయ్యాడంట. ఆయన చేయాల్సిన సినిమాతో విశ్వక్ సేన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా ఏంటీ ? అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సత్యదేవ్ ఇటీవలే అరేబియా కడలి సిరీస్ తోపాటు కింగ్డమ్ మూవీతో అడియన్స్ ముందుకు వచ్చారు.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..

అయితే అరేబియా కడలి సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యదేవ్ తన సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. హిట్ సినిమా ఫ్రాంచైజ్ డైరెక్టర్ హిట్ 1 సినిమాను సత్యదేవ్ తో చేయాలనుకున్నార. కానీ నైట్ టైం అనుకోని నెక్ట్స్ డే మార్నింగ్ సత్యదేవ్ కు కథ చెప్పడానికి ప్లాన్ చేసుకోవాలి.. ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నారట. అదే రోజు రాత్రి సత్యదేవ్ చేసిన ఓ సినిమా ట్రైలర్ చూశాడట. అందులో సత్యదేవ్ పోలీస్ పాత్రలో కనిపించాడట. దీంతో బ్యాక్ టూ బ్యాక్ పోలీస్ అయితే తన సినిమా పాత్రకు అంతగా ఇంపాక్ట్ ఉండదు అని ఆ ఆలోచన విరమించుకున్నారట. చివరకు ఆ ప్రాజెక్ట్ విశ్వక్ సేన్ వద్దకు వెళ్లింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..

హిట్ ఫ్రాంఛైజ్ లో ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన హిట్ 2, హిట్ 3 మూవీస్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇక త్వరలోనే హిట్ 4 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే నిజానికి ఏ సినిమాలో సత్యదేవ్ ను పోలీస్ పాత్రలో చూశారో.. ఆ మూవీ ఇంకా రిలీజ్ కాలేదట.

ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‏ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‏తో బ్యాచిలర్ పార్టీ..