Sai Pallavi: ఇది సాయి పల్లవి రేంజ్.. అమరన్ సినిమా కోసం న్యాచురల్ బ్యూటీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ?

కోలీవుడ్ హీరో శివకార్తికేయన్‏కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలోఒకరిగా దూసుకుపోతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్న ఈ హీరో.. ఇప్పుడు ‘అమరన్’ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. దివంగత ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుందన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి నటిస్తుంది.

Sai Pallavi: ఇది సాయి పల్లవి రేంజ్.. అమరన్ సినిమా కోసం న్యాచురల్ బ్యూటీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ?
Sai Pallavi
Follow us

|

Updated on: Oct 27, 2024 | 9:23 AM

సౌత్ అడియన్స్ ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా అమరన్. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ దీపావళీ కానుకగా అక్టోబర్ 31న తమిళం, తెలుగు భాషలలో ఏకకాలంలో విడుదలకానుంది. కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తుండగా.. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇందులో సాయి పల్లవి లుక్, యాక్టింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీ ఎప్పుడూ విడుదలవుతుందా అని వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

దివంగత ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుందన్ జీవితం ఆధారం రూపొందుతున్న ఈ చిత్రంలో ముకుందన్ పాత్రలో శివకార్తికేయన్ నటిస్తుండగా.. ఆయన భార్య ఇందు రెబికా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. ఇప్పటివరకు విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ లో శివకార్తీకేయన్, సాయి పల్లవి కెమిస్ట్రీ సినిమాపై మరింత హైప్ తీసుకువచ్చింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ విడుదల సమయం దగ్గర పడుతుండడంతో కొన్ని రోజులుగా మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది చిత్రయూనిట్.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో నటించేందుకు సాయి పల్లవి ఎంత పారితోషికం తీసుకుంటుందనే విషయం నెట్టింట తెగ వైరలవుతుంది. కథనాల ప్రకారం నటి సాయి పల్లవి రూ. 3 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడకపోవడం గమనార్హం. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది.

ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..

Arjun Reddy: తస్సాదియ్యా.. ఏం మేకోవర్ భయ్యా.. ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీని ఇప్పుడు చూస్తే ప్రేమలో పడాల్సిందే..

Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్‍ లుక్‏లో తారక్.. వేరేలెవల్ అంతే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!