Monica Song: మోనికా పాటలో స్టెప్పులతో ఇరగదీసిన ఈ నటుడి గురించి తెలుసా.. ? బ్యాగ్రౌండ్ తెలిస్తే..
మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మరికొన్ని గంటల్లో అడియన్స్ ముందుకు రాబోతుంది. భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 14న ఈ సినిమా విడుదల కాబోతుంది. దీంతో సోషల్ మీడియాలో కూలీ హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతుంది. మరోవైపు కూలీ నుంచి విడుదలైన మోనికా సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న లేటేస్ట్ మూవీ కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న ఈ చిత్రం ఆగస్ట్ 14న అడియన్స్ ముందుకు వస్తుంది. ఇందులో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించడంతో.. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ సినిమాపై మరింత హైప్ పెంచాయి. ముఖ్యంగా కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నుంచి విడుదలైన మోనికా సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. పూజా హెగ్డే చేసిన ఈ స్పెషల్ సాంగ్ ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా అనిరుధ్ మ్యూజిక్, పూజా డ్యాన్స్ మరో హైలెట్ అయ్యాయి.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
అయితే మోనికా పాటలో పూజా హెగ్డేను బీట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు సౌబిన్ షాహిర్. తన డ్యాన్స్ స్టెప్పులతో అందరిని ఆశ్చర్యపరిచారు. ఇటీవల జరిగిన కూలీ ప్రీ రిలీజ్ వేడుకలోనే తన స్టెప్పులతో అదరగొట్టాడు సౌబిన్. ఇంతకీ ఈ నటుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా.. ? సౌబిన్ షాహిర్ ప్రధానంగా మలయాళీ యాక్టర్. అలాగే దర్శకుడిగా, నిర్మాతగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. రళలో జన్మించిన ఆయన, మణిచిత్రతళు, గాడ్ ఫాదర్, ఇన్ హరిహర్ నగర్ వంటి చిత్రాలలో పనిచేసిన మాజీ యాడ్ , ప్రొడక్షన్ కంట్రోలర్ అయిన బాబు షాహిర్ కుమారుడు.
ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మలయాళీ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. మమ్ముట్టి నటించిన క్రానిక్ బ్యాచిలర్ (2003) చిత్రంతో అరంగేట్రం చేశాడు . అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఫాజిల్ దర్శకత్వం వహించిన కైయేతుమ్ దూరత్ (2002)లో నటుడిగా అరంగేట్రం చేశాడు. అల్ఫోన్స్ పుతారెన్ దర్శకత్వం వహించిన ప్రేమమ్ (2015) చిత్రంలో అతను పిటి టీచర్ పాత్రను పోషించాడు. ఆ తర్వాత తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 2017 లో, సౌబిన్ షాహిర్ ‘పరవ’ అనే ఫీల్-గుడ్ డ్రామాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. అటు విలన్ పాత్రలలోనూ నటించారు.
ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ..




