Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..

సాధారణంగా బుల్లితెరపై సీరియల్ హీరోహీరోయిన్లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం ఓ లేడీ విలన్ ట్రెండ్ సెట్ చేసింది. స్మాల్ స్క్రీన్ పై ఆమె పవర్ ఫుల్ విలన్. పుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుంది. కానీ నెట్టింట మాత్రం హీరోయిన్లకు మించిన ఫిట్నెస్, గ్లామర్ లుక్స్ తో కట్టిపడేస్తుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ?

Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
Sharmitha Gowda

Updated on: Oct 15, 2025 | 4:58 PM

బుల్లితెరపై తల్లి, అత్త పాత్రలతో పాపులర్ అయ్యింది. కన్నడలో ఎక్కువగా పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకుంది. కానీ తెలుగులో మాత్రం పవర్ ఫుల్ విలన్ పాత్రలో అదరగొట్టేస్తుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తూ… తన నటనతో జనాలను ఆశ్చర్యపరుస్తుంది. కానీ సీరియల్ హీరోయిన్లకు మించిన అందం, గ్లామర్ లుక్స్ లో కనిపిస్తూ అడియన్స్ ను ఆకట్టుకుంటుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మడు స్మాల్ స్క్రీన్ పై గ్లామర్ బ్యూటీ. విలన్ పాత్రలో కనిపించినప్పటికీ.. అందం, అభినయంలో మాత్రం తగ్గేదే లే అంటుంది. ఆమె మరెవరో కాదు.. రుద్రాణి అత్త.. అలియాస్ షర్మిత గౌడ. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..

ప్రస్తుతం టీవీలో దూసుకుపోతున్న బ్రహ్మాముడి సీరియల్ ద్వారా జనాలకు దగ్గరయ్యింది. ఇందులో రుద్రాణి అత్త పాత్రలో నటిస్తుంది. అంతకుముందు కన్నడలో గీత సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది. ఇందులో హీరో తల్లి పాత్రలో నటిస్తుంది. సీరియల్లో తల్లి, అత్త పాత్రలలో కనిపిస్తున్న షర్మిత గౌడ వయసు కేవలం 33 సంవత్సరాలు మాత్రమే. ఆమె 1990 నవంబర్ 20న జన్మించింది. గ్రాడ్యుయేషన్ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఎక్కువగా సీరియల్స్ చేసింది. కన్నడలో అనేక సీరియల్స్ చేసిన షర్మిత గౌడ.. ఇప్పుడు తెలుగులో బ్రహ్మాముడి సీరియల్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

మరోవైపు కన్నడలో పలు రియాల్టీ షోలలో పాల్గొంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. షర్మితకు ఒక బాబు ఉన్నాడు. అతడు వయసు 13 సంవత్సరాలు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. ఎక్కువగా మోడ్రన్ , గ్లామర్ లుక్ ఫోటోస్ షేర్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

 

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..