Sathyaraj : కట్టప్ప జీవితంలో ఊహించని విషాదం.. నాలుగేళ్లుగా కోమాలో భార్య.. పిల్లలకు అన్నీ తానై..

సత్యరాజ్.. ఈ పేరు కంటే కట్టప్ప అంటే యావత్ ప్రపంచమే గుర్తుపడుతుంది. అంతగా ఒక్క పాత్రతో పాపులర్ అయ్యాడు. దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు హీరోగా అలరించిన సత్యరాజ్.. ఇప్పుడు సహాయ నటుడిగా రాణిస్తున్నారు. తమిళం, మలయాళం, తెలుగు భాషలలో బ్యాక్ టూ బ్యా్క్ సినిమాల్లో నటిస్తూ తన నటనతో అలరిస్తున్నాడు. కానీ మీకు తెలుసా.. కట్టప్ప జీవితంలో ఎన్ని కన్నీళ్లను దాచుకున్నారో.

Sathyaraj : కట్టప్ప జీవితంలో ఊహించని విషాదం.. నాలుగేళ్లుగా కోమాలో భార్య.. పిల్లలకు అన్నీ తానై..
Sathyaraj

Updated on: Feb 08, 2026 | 9:27 AM

ఒకప్పుడు హీరోగా మెప్పించిన సత్యరాజ్.. ఇప్పుడు సహయ నటుడిగా దూసుకుపోతున్నారు. తెలుగు, మలయాళం, తమిళంలో భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. దశాబ్దాలుగా సినీరంగంలో నటుడిగా కొనసాగుతూ తనదైన ముద్ర వేసిన సత్యరాజ్.. వ్యక్తిగత జీవితం ఊహించనంత ఆనందంగా లేదు. వెండితెరపై తన నటనతో కట్టిపడేసే సత్యరాజ్.. ఇంట్లో మాత్రం కంటిరెప్పల చాటున కన్నీళ్లను దాచుకున్నాడు. సత్యరాజ్ కుటుంబం గత నాలుగు సంవత్సరాలుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆయన భార్య మహేశ్వరి సత్యరాజ్ మెదడులో రక్తస్రావం కావడంతో కొన్నాళ్లుగా కోమాలో ఉండిపోయింది.

ఎక్కువ మంది చదివినవి : Krishnavamshi : నేను తీసిన సినిమాల్లో ఆ రెండే చెత్త సినిమాలు.. డైరెక్టర్ కృష్ణవంశీ..

ఈ విషయాన్ని సత్యరాజ్ కుమార్తె డైటీషియన్ దివ్య సత్యరాజ్ గత రెండేళ్ల క్రితం బయటపెట్టింది. దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం సత్యరాజ్ భార్య 50 సంవత్సరాల వయసులో ఒక నిర్ణయం తీసుకుంది. భర్త , పిల్లలు కెరీర్ సెటిల్ అయిన తర్వాత ఆమె నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని అనుకుందట. ఆమె తమిళనాడులోని ఉడుమల్‌పేటలోని విశాలాక్షి కళాశాల నుండి ఆంగ్ల సాహిత్యంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. బంధువులు తమ పెళ్లికి అడ్డు చెప్పినప్పటికీ సత్యరాజ్ కు తోడుగా నిలిచింది మహేశ్వరి. మొదటి నుంచి ఆయన స్థిరపడే వరకు ప్రతి విషయంలోనూ మద్దతు తెలిపింది.

ఎక్కువ మంది చదివినవి : Actress : మల్లీశ్వరీ సినిమా నేను చేయకుండా ఉండాల్సింది.. నటి కామెంట్స్..

తన పిల్లలతో కలిసి డ్రైవింగ్, స్వమ్మింగ్ నేర్చుకుంది మహేశ్వరి. ఆమె తన అత్తగారి పేరు మీద నాదంబల్ ఫిల్మ్ ఫ్యాక్టరీని ప్రారంభించింది, సత్యరాజ్ ప్రతి అడుగులోనూ ఆమె పక్కనే ఉంది. కానీ 2020-21లో, ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మహేశ్వరి గత నాలుగు సంవత్సరాలుగా మెదడు రక్తస్రావం కారణంగా కోమాలో ఉన్నారు. ప్రస్తుతం ఆమెకు ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. అలాగే PEG ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నారు. భార్య కోమాలో ఉండడంతో ఇద్దరు పిల్లలకు అన్నీ తానై చూసుకున్నాడు సత్యరాజ్.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : అందంలో రాజహంస.. 47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్.. ఆత్మస్థైర్యానికి నిలువెత్తు రూపం..

ఎక్కువ మంది చదివినవి : Love Song : నిజంగా ఏం పాట బాసూ.. 1999 నుంచి ట్రెండింగ్.. ప్రేమికులకు చాలా స్పెషల్ సాంగ్..