టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ హవా నడుస్తోంది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడున్న యంగ్ హీరోస్లో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఒకరు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన కిరణ్.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గర్యయ్యాడు. ఇటీవల ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. క్లాస్, మాస్, యూత్, ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు కిరణ్ అబ్బవరం. తాజాగా ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా సెబాస్టియన్ పీసీ 524 (Sebastian PC524). ఇందులో కిరణ్ సరసన కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించగా.. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ మార్చి 4న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ఫిబ్రవరి 28న రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా సెబాస్టియన్ పీసీ 524 ట్రైలర్ రిలీజ్ చేయించారు మేకర్స్. ఆర్థిక సమస్యలు, కష్టాలతో పెరిగి.. చివరు పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు.. మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కోని సస్పెండ్ కావడం.. తిరిగి ఆ కేసును ఎలా చేధించాడు అనేది ట్రైలర్లో చూపించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్న ట్రైలర్లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.
Also Read: Sarkaru Vaari Paata: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న కళావతి సాంగ్.. టాలీవుడ్లోనే నెంబర్ వన్ రికార్డ్..
Nithiin: సౌత్ ఇండియాలోనే ఆ విషయంలో ఏకైక హీరోగా నితిన్.. బీటౌన్‌లో క్రేజ్ మాములుగా లేదుగా..
Thyroid: థైరాయిడ్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా ? అయితే ఈ జ్యూస్‌లతో చెక్ పెట్టొచ్చు.. అవెంటంటే..
Viral Photo: చూడగానే మైమరిపించే కళ్లు.. చూస్తూనే ఉండాలనిపించే మోము.. ఎవరో గుర్తించారా..?