
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్నారు. తాజాగా ఆయన నటించిన కె ర్యాంప్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీపావళీ కానుకగా వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ రావడంతో క్రమంగా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. అక్టోబర్ 18న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. ఇందులో కిరణ్ సరసన యుక్తి తరేజా నటించగా.. నరేష్ వీకే, సాయి కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈసినిమా సక్సె్స్ ను అభిమానులతో కలిసి థియేటర్లో సెలబ్రేట్ చేసుకున్నారు కిరణ్. తాజాగా ఓ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి కె ర్యాంప్ పాటకు డ్యాన్స్ అదరగొట్టారు. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది.
కె ర్యాంప్ సక్సెస్ సెలబ్రేషన్లలో భాగంగా ఓ థియేటర్ లో కిరణ్ అబ్బవరం ప్రేక్షకులతో కలిసి డ్యాన్స్ ఇరగదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో అడియన్స్ మధ్యలో నిలబడి వాళ్లతో కలిసి స్టెప్పులేశాడు. ఆ వీడియోపై “మీరు ఇచ్చిన సక్సెస్ మీతో సెలబ్రేట్ చేసుకుంటుంటే” అంటూ ఫైర్ ఎమోజీలు పెట్టారు. వేరే లెవల్.. ప్రతి ఒక్కరికీ థ్యాంక్ యూ అంటూ క్యాప్షన్ ఇస్తూ ఆ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుండగా.. కిరణ్ అబ్బవరం డ్యాన్స్ వేరేలెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
ఈ చిత్రానికి కొత్త దర్శకుడు జైన్స్ నాని దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మించారు. క లాంటి డిఫరెంట్ థ్రిల్లర్ డ్రామాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కిరణ్.. ఆ తర్వాత దిల్ రూబా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా నిరాశ పరిచింది. ఇక ఇప్పుడు కె ర్యాంప్ సినిమాతో మరోసారి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..