స్టార్ దర్శకుడు శంకర్ ప్రస్తతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంచిందించిన పనులు కూడా మొదలుపెట్టాడు శంకర్. ప్రస్తుతం చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్ పైన ఉన్నాయి. ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు కంప్లీట్ ఆయన వెంటనే శంకర్ సినిమా మొదలుపెట్టనున్నాడు చరణ్. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించేది ఎవరు.? అనే దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొదట ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోందని టాక్ వినిపించింది. ఆతర్వాత లక్కీ బ్యూటీ రష్మిక మందన నటిస్తోందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అలాగే బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పేరు కూడా వినిపించింది. అయితే తాజాగా వినిపిస్తోన్న టాక్ ప్రకారం కియారా దాదాపు కన్ఫామ్ అయిపోయిందని అంటున్నారు.తాజాగా కియారా పూర్త్తిన రోజు సందర్భంగా కియారా కన్ఫామ్ అయిపోయిందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. కియారకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆహ్వానించారు.
తెలుగులో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత చరణ్ సరసన వినయ విధేయ రామ అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం సాధించకపోవడంతో తిరిగి బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ ‘కబీర్ సింగ్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఈ అమ్మడికి అక్కడ వరుస అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం ఈ చిన్నది బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇక ఇప్పుడు శంకర్ సినిమాలో ఈ చిన్నది నటిస్తుందన్న వార్త అటు బాలీవుడ్‌లో.. ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిని పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది.
The stunning and talented @advani_kiara is all set to join team #RC15 #SVC50 #HappyBirthdayKiaraAdvani@ShankarShanmugh @AlwaysRamCharan @MusicThaman @SVC_official pic.twitter.com/hOeAMy6g5U
— BARaju’s Team (@baraju_SuperHit) July 31, 2021