AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sumanth: విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంటే.. ఆసక్తికరంగా సుమంత్‌ కొత్త సినిమా మళ్లీ మొదలైంది ఫస్ట్‌లుక్‌..

Sumanth: అక్కినేని హీరో సుమంత్‌ మళ్లీ పెళ్లి చేసుకోనున్నాడని ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. నిజానికి సుమంత్‌ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమాకు సంబంధించిన...

Sumanth: విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంటే.. ఆసక్తికరంగా సుమంత్‌ కొత్త సినిమా మళ్లీ మొదలైంది ఫస్ట్‌లుక్‌..
Sumanth New Movie
Narender Vaitla
|

Updated on: Jul 31, 2021 | 10:17 AM

Share

Sumanth: అక్కినేని హీరో సుమంత్‌ మళ్లీ పెళ్లి చేసుకోనున్నాడని ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. నిజానికి సుమంత్‌ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమాకు సంబంధించిన వెడ్డింగ్‌ కార్డు లీక్‌ కావడం ఈ గందరగోళానికి దారి తీసింది. సుమంత్‌ మళ్లీ పెళ్లి చేసుకోనున్నాడని వచ్చిన వార్తలపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కూడా ట్వీట్ చేయడంతో ఈ అంశం మరింత వైరల్‌గా మారింది. దీంతో దీనికి చెక్‌ పెడుతూ సుమంత్‌ ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే చిత్ర యూనిట్‌ సుమంత్‌ కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ను శుక్రవారం అధికారికంగా విడుదల చేశారు. ‘మళ్లీ మొదలైంది’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ చిత్రంపై ఆసక్తిని పెంచేసింది. ఈ ఫస్ట్‌లుక్‌ను గమనిస్తే ‘విడాకులు తర్వాత జీవితం’ ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు అర్థమవుతోంది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్న సుమంత్.. ‘విడాకులు తర్వాత మళ్లీ వివాహం అనే కాన్సెప్ట్‌తో తెలుగులో వస్తోన్న తొలి చిత్రం ఇదే’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. వినూత్న కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఇదిలా ఉంటే టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నైనా గంగూలీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్‌, మంజుల ఘట్టమనేని, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

మళ్లీ మొదలైంది ఫస్ట్‌ లుక్‌..

Also Read: Shakeela: నేనింకా బతికే ఉన్నాను.. తన ఆరోగ్యంపై ఫేక్‌ వార్తను సృష్టించిన వారికి ధన్యవాదాలు తెలిపిన షకీలా. ఎందుకంటే..

Nabha Natesh: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ.. బాలీవుడ్ బడా హీరో సరసన నభానటేష్..

Sonu Sood : బన్నీ కోసం బరిలోకి దిగనున్న సోనూసూద్.. ‘పుష్ప’లో నటించనున్న జులాయి విలన్.?

Follow Us
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!
నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!