K.G.F Chapter 2 : ఏడాది పాటు వాయిదా పడుతూ వస్తున్న కేజీఎఫ్ 2కు ఈసారి మోక్షం కలిగేనా..?

|

Feb 19, 2022 | 10:11 AM

ప్రజెంట్ పాన్ ఇండియా లెవల్‌లో భారీ హైప్‌ క్రియేట్ చేస్తున్న సినిమాల్లో కేజీఎఫ్ 2 కూడా ఒకటి. కోవిడ్ కారణంగా డీలే అయినా ఈ సినిమా మీద హైప్‌ ఏమాత్రం తగ్గలేదు.

K.G.F Chapter 2 : ఏడాది పాటు వాయిదా పడుతూ వస్తున్న కేజీఎఫ్ 2కు ఈసారి మోక్షం కలిగేనా..?
Kgf 2
Follow us on

K.G.F Chapter 2 : ప్రజెంట్ పాన్ ఇండియా లెవల్‌లో భారీ హైప్‌ క్రియేట్ చేస్తున్న సినిమాల్లో కేజీఎఫ్ 2 కూడా ఒకటి. కోవిడ్ కారణంగా డీలే అయినా ఈ సినిమా మీద హైప్‌ ఏమాత్రం తగ్గలేదు. సమ్మర్ రిలీజ్ అంటూ ఆల్రెడీ డిక్లేర్‌ చేసిన మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. థర్డ్ వేవ్‌ భయపెడుతున్న ఈ టైమ్‌లో రిలీజ్ డేట్ విషయంలో కేజీఎఫ్ టీమ్‌ కాన్ఫిడెన్స్ ఏంటి..? ఏప్రిల్ నాటికి పరిస్థితులు సర్దుకుంటాయా.. బాహుబలి తరువాత ఆ రేంజ్‌లో బజ్‌ క్రియేట్ చేసిన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్‌. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా.. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ భారీ వసూళ్లు సాధించింది. అందుకే ఈ సినిమా సీక్వెల్ మీద నేషనల్‌ లెవల్‌లో భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా పాన్ ఇండియా కాస్టింగ్‌తో నెక్ట్స్‌ లెవల్‌లో సీక్వెల్‌ను సిద్ధం చేస్తున్నారు మేకర్స్‌.
కరోనా ఎఫెక్ట్ పడకపోయుంటే 2020 అక్టోబర్‌లోనే కేజీఎఫ్‌ 2 ఆడియన్స్‌ ముందుకు వచ్చుండేది. కానీ వరుసగా ఫస్ట్, సెకండ్ వేవ్‌ వల్ల సినిమా ఆలస్యమైంది. దీంతో 2021 జూలై 16న రిలీజ్ అంటూ న్యూ డేట్ ఇచ్చారు మేకర్స్‌. కానీ ఆ టైమ్‌లో సెకండ్ వేవ్‌ పీక్స్‌లో ఉండటంతో రిలీజ్ మరోసారి వాయిదా పడింది. ఈసారి ఏకంగా ఏడాది పాటు వాయిదా వేసిన యూనిట్ 2022 సమ్మర్‌లో సినిమా రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ ఇయర్‌ సమ్మర్‌ సీజన్‌కి స్లాట్ బుక్‌ చేసిన ఫస్ట్ మూవీ కేజీఎఫ్ 2నే. అయినా ప్రజెంట్ సిచ్యుయేషన్ చూస్తుంటే.. రిలీజ్‌కు ఎంత వరకు ఛాన్స్ ఉంటుందన్న డౌట్స్‌ రెయిజ్ అవుతున్నాయి. ఆల్రెడీ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యింది. ఈ ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉంటుందన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. థియేటర్లు పూర్తి స్థాయిలో కళకళలాడుతున్నప్పుడే సినిమా రిలీజ్‌ అంటూ ముందే డిక్లేర్ చేసిన కేజీఎఫ్ టీమ్‌.. ఏప్రిల్ నాటికి పరిస్థితులు సెట్ రైట్‌ అవుతాయన్న నమ్మకంతోనే ఉన్నారా..? తాజాగా యష్ బర్త్‌డే సందర్భంగా న్యూ పోస్టర్‌ను షేర్ చేసిన మేకర్స్ రిలీజ్ డేట్‌ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 14న రాకీబాయ్‌ థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వటం పక్కా అన్నది లేటెస్ట్‌ అప్‌డేట్‌. మరి అప్పటి పరిస్థితులు బిగ్‌ మూవీస్‌ రిలీజ్‌లకు ఎంత వరకు పర్మిట్ చేస్తాయో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

NBK107: మొదలైన బాలయ్య 107వ సినిమా.. సిరిసిల్లలో షూటింగ్ ప్రారంభం..!

Alia Bhatt: అందాలతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్న అలియా భట్ లేటెస్ట్ పిక్స్

Malavika Mohanan: పాన్ ఇండియా స్టార్ సరసన ఛాన్స్ దక్కించుకున్న మాస్టర్ బ్యూటీ.?