డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో విడుదలైన కేజీఎఫ్ 2 (KGF 2) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంచనాలను తలకిందులు చేస్తూ రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది ఈ సినిమా. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 50 రోజులను పూర్తిచేసుకుంది. దీంతో తమ సినిమాను ఇంతలా ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది చిత్రయూనిట్. ట్రేడ్ వర్గాల ప్రకారం కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1240 కోట్లు వసూలు చేసింది.. ఇక ఇప్పుడు రూ. 1250 కోట్లకు చేరువలో ఉంది ఈ సినిమా. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది.
ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయ్ బాలన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సినిమా 50 రోజులలో ప్రపంచవ్యాప్తంగా రూ. 1240 కోట్లు వసూలు చేసింది. బాక్సాఫీస్ ట్రూ బ్లూ బ్లాక్ బస్టర్..
మొదటి వారం నుంచి 5వ వారం వరకు రూ. 1210.53 కోట్లు..
6 వారం.. రూ.19.84 కోట్లు.
7 వారం..రూ. 1.02 కోట్లు.
2వ రోజు..రూ. 1.34 కోట్లు.
3వ రోజు.. రూ. 2.41 కోట్లు.
4వ రోజు.. రూ. 3.06 కోట్లు.
5వ రోజు.. రూ. 0.92 కోట్లు.
6వ రోజు.. రూ. 0.85 కోట్లు.
7వ రోజు.. రూ. 0.98 కోట్లు.
మొత్తం.. రూ. 1240.95 కోట్లు.
#KGFChapter2 WW Box Office
True blue blockbuster
Week 1 to 5 – ₹ 1210.53 cr
Week 6 – ₹ 19.84 cr
Week 7
Day 1 – ₹ 1.02 cr
Day 2 – ₹ 1.34 cr
Day 3 – ₹ 2.41 cr
Day 4 – ₹ 3.06 cr
Day 5 – ₹ 0.92 cr
Day 6 – ₹ 0.85 cr
Day 7 – ₹ 0.98 cr
Total – ₹ 1240.95 crTREMENDOUS run.
— Manobala Vijayabalan (@ManobalaV) June 2, 2022
కేజీఎఫ్ 2 పూర్తిచేసుకున్నందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. “ఈ మైలురాయిని దాటేలా చేసినందకు ధన్యవాదాలు.. గతంలో వాగ్దానం చేశాము.. ఇప్పుడు అది నిజమైంది. మీ ప్రేమ, తిరుగులేని మద్దతుతో ఇది సాధ్యమైంది.. మీకు ధన్యవాదాలు. ” అంటూ పోస్ట్ చేశారు. ఈ సినిమా యశ్ కాకుండా.. ప్రకాష్ రాజ్, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, కీలకపాత్రలలో నటించగా.. రవి బస్రూర్ సంగీతం అందించారు.
Thank You for scripting monstrous milestone with us?
A promise was once made n that promise was well kept.
Thank you for making this possible with your unconditional love n unwavering support.
We can still feel the jubilation n the reverberation of the Monster celebration #KGF2 pic.twitter.com/1tCWcnxax3— Hombale Films (@hombalefilms) June 2, 2022