ఆ కళ్లు చూడు.. ఆ బుగ్గలు చూడు మావ..! కుర్రాళ్లను గిలిగింతలు పెడుతున్న కేతిక
చాలా మంది ముద్దుగుమ్మలు అందం అభినయం ఉన్న ఇండస్ట్రీలో ఎక్కువకాలం కంటిన్యూ అవ్వలేకపోతున్నారు. చేస్తున్నా కూడా హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నారు కొందరు. వారిలో కేతిక శర్మ ఒకరు. చేసిన సినిమాలన్నీ నిరాశపరిచినా.. ఆమె క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

కేతిక శర్మ 2021లో విడుదలైన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆకాష్ పూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత లక్ష్య అనే సినిమా చేసింది కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా, అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలో చేసింది. కానీ ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక రీసెంట్ గా నితిన్ హీరోగా వెంకీ కుడుములు దర్శకత్వంలో వచ్చిన రాబిన్ హుడ్ అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ లో తన అందాలతో అదరగొట్టింది కేతిక. సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోక పోయినా ఈ సాంగ్ మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ఇక ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం కేతిక చేతిలో సినిమాలు ఏవి లేవు. కానీ సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలు, హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక తన అందాలతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
నిన్నటివరకు రాబిన్ హుడ్ సాంగ్ కు రీల్స్ చేస్తూ నెటిజన్స్ ను కవ్వించిన కేతిక ఇప్పుడు మరోసారి తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లను కవ్విస్తున్నాయి. నడుము అందాలతో కుర్రకారును రెచ్చగొడుతుంది. ఈ ఫోటోలకు నెటిజన్స్ రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మడి ఈ బ్యూటీ లేటెస్ట్ హాట్ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.