
సినిమాల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు స్టార్ హీరో విజయ్ దళపతి. తమిళనాడు రాజకీయాలకు కొత్త దిశానిర్దేశం చూపిస్తానని విజయ్ అంటున్నారు. దళపతి రాజకీయ ప్రవేశాన్ని ఆయన అభిమానులు కూడా స్వాగతిస్తున్నారు. అదే సమయంలో దీనిని వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. విజయ్ టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ స్థాపించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మహాబలిపురంలోని ఒక రిసార్ట్‌లో వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే మహాబలిపురంలో కార్యక్రమం జరుగుతుండగా, ఒక యువకుడు విజయ్ ఇంటిపై చెప్పులు విసిరాడు. బుధవారం (ఫిబ్రవరి 26) ఒక యువకుడు విజయ్ ఇంటి గేటు లోపలికి చెప్పు విసిరి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో, విజయ్ భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి మానసిక రోగంతో బాధపడుతున్నాడని తెలుస్తోంది. అదే సమయంలో అతను తన పిల్లల చెప్పులను విజయ్ ఇంట్లోకి విసిరేశాడని తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా ఆ గుర్తు తెలియని యువకుడు ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. నేను కేరళలోని మణప్పురం నుండి వచ్చాను. నేను విజయ్ సార్ అభిమానినే. తమిళనాడులో చాలా మంది పిల్లలు చెప్పులు లేకుండా ప్రయాణిస్తున్నారు. ఈ విషయం విజయ్ దృష్టికి తీసుకురావడానికి నేను ఆయన ఇంటి గేటు లోపలికి నా చెప్పులు విసిరేశాను’ అని చెప్పుకొచ్చాడు.
కాగా తన పార్టీ వార్షిక సమావేశంలో తలపతి విజయ్ మాట్లాడుతూ, తమిళనాడు అధికార డీఎంకే పార్టీ అలాగే బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. గత కొన్ని నెలలుగా హిందీ భాషా అంశంపై డీఎంకే, కేంద్ర ప్రభుత్వం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఈ విషయంపై విజయ్ మాట్లాడుతూ, ‘హిందీ అంశంపై రెండు పార్టీలు తమకు నచ్చినట్లు డ్రామా చేస్తున్నాయి. వాళ్ళు LKG-UKG పిల్లల్లా కోట్లాడుకుంటున్నారు.ఈ రెండు పార్టీలు సమస్యను కప్పిపుచ్చేందుకే ఈ నాటకాన్ని ఆడుతున్నారు’ అని విజయ్ విమర్శించారు. కాగా వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయనున్నారు.
Thalapathy @actorvijay about our hashtag #TVKForTN on Twitter X 😂💥 #இரண்டாம்_ஆண்டில்_தவெக @TVKVijayHQ pic.twitter.com/hPH8yCwKdv
— Vijay Fans Trends (@VijayFansTrends) February 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.