AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: ఎడారిలో సూపర్ హీరోలా కీర్తి సురేష్.. మహానటి మాములు టాలెంటెడ్ కాదు బాబోయ్..

మహానటి తర్వాత మరోసారి తన నటనతో ప్రేక్షకులకు ఫిదా చేసిన పాత్ర అంటే వెన్నెలనే. ఇటీవల నాని నటించిన దసరా సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది కీర్తి. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటించి భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లిగా మెప్పించింది. ప్రస్తుతం కీర్తి చేతిలో పలు తమిళ సినిమాలు ఉన్నాయి. చేతినిండా సినిమాలు ఉండడంతో ఫుల్ బిజీగా ఉన్న కీర్తి.. ఇటు సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటుంది.

Keerthy Suresh: ఎడారిలో సూపర్ హీరోలా కీర్తి సురేష్.. మహానటి మాములు టాలెంటెడ్ కాదు బాబోయ్..
Keerthy Suresh
Rajitha Chanti
|

Updated on: Nov 06, 2023 | 12:45 PM

Share

మహానటి సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకుంది కీర్తి. ఈ మూవీ తర్వాత తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అగ్రకథానాయికగా కొనసాగింది. అందం, అభినయం ఎంత ఉన్నా.. ఇప్పటికీ కీర్తికి తగిన రోల్ రావడం లేదనే చెప్పాలి. మహానటి తర్వాత మరోసారి తన నటనతో ప్రేక్షకులకు ఫిదా చేసిన పాత్ర అంటే వెన్నెలనే. ఇటీవల నాని నటించిన దసరా సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది కీర్తి. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటించి భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లిగా మెప్పించింది. ప్రస్తుతం కీర్తి చేతిలో పలు తమిళ సినిమాలు ఉన్నాయి. చేతినిండా సినిమాలు ఉండడంతో ఫుల్ బిజీగా ఉన్న కీర్తి.. ఇటు సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడో ఒక పోస్ట్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ఆ వీడియోలో కీర్తి చెన్నైలోని ఓ బీచ్‏లో మహీంద్రా థార్ నడుపుతూ కనిపించింది. సినిమాల్లో హీరోలు చేసే ఛేజింగ్ సీన్స్ లో థార్ నడిపినట్లుగా బీచ్ ఇసుకలో థార్ సూపర్ హీర్ రేంజ్ లా స్టైలీష్‏గా నడిపింది. ఈ వీడియోను షేర్ చే్సతూ.. ఆదివారం పూట చెన్నై బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. అయితే కీర్తి ఇసుకలో థార్ అంత స్టైలీష్ గా నడపడం చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. కీర్తి సూపర్.. అదరగొట్టేశావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక కీర్తికి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టమని గతంలో అనేక సార్లు చెప్పుకొచ్చింది. మనసు చలించి ఒత్తిడికి గురైనప్పుడు డ్రైవింగ్ కు వెళ్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కీర్తి. ఇదిలా ఉంటే.. త్వరలోనే కీర్తి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. డైరెక్టర్ అట్లీ హిందీలో రీమేక్ చేయబోతున్న తేరి చిత్రంలో కీర్తి నటించనున్నట్లు టాక్ నడిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..