
అందాల భామ కీర్తిసురేష్ ప్రస్తుతం తెలుగు తమిళ్ సినిమాలతో ఫుల్ బిజిగా ఉంది. వీటితో పాటు ఇప్పుడు హిందీలోనూ సత్తా చాటడానికి రెడీ అవుతుంది. మొన్నామధ్య హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. తెలుగులో కీర్తిసురేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తక్కువ సమయంలోనే మన దగ్గర మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. నేను శైలజ సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ మహానటి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది. ఆతర్వాత వరుసగా యంగ్ హీరోల సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అలాగే తమిళ్ లోనూ సూపర్ హిట్ సినిమాలు చేసింది. స్టార్ హీరోలతో జతకట్టి టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం రీవాల్వర్ రీటా అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ మూవీగా రానుంది.
ఇదిలా ఉంటే గతంలో కీర్తిసురేష్ మెగాస్టార్ చిరంజీవి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట మరోసారి చక్కర్లు కొడుతున్నాయి. దాంతో కీర్తిసురేష్ ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ ఇంటర్వ్యూలో కీర్తిసురేష్ మాట్లాడుతూ.. చిరంజీవి కంటే దళపతి విజయ్ డాన్స్ బాగా చేస్తారు అని కామెంట్ చేసింది. విజయ్ ఆమె అభిమాన డాన్సర్ అని చెప్పుకొచ్చింది. దాంతో కొందరు మెగా ఫాన్స్ ఆమెను ట్రోల్ చేశారు.
దళపతి విజయ్ తో ‘భైరవ’, ‘సర్కార్’ అనే సినిమాల్లో నటించింది కీర్తిసురేష్. అలాగే మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో కీర్తిసురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించింది. ఇక ఇప్పుడు కీర్తిసురేష్ చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపుతోంది. దళపతి విజయ్ పై ఉన్న అభిమానంతో ఆమె అలా చెప్పి ఉండొచ్చు అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం మెగాస్టార్ డాన్స్ ను వంక పెడతావా.? అంటూ ఆమె పై ట్రోల్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.