
ఛాన్స్ దొరికితే నటనతో ఆకట్టుకుంటారు కొందరు హీరోయిన్.. అలా కాకుండా కేవలం స్కిన్ షో తోనో.. సినిమాలో గ్లామర్ కోసమే అన్నట్టుగా కొంతమంది హీరోయిన్స్ నెట్టుకొస్తూ ఉంటారు. కానీ ఈ అమ్మడు మాత్రం అలా కాకుండా.. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. నటనకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆకట్టుకుంటోంది. దాంతో ఈ అమ్మడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది. అయితే ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచి ఫ్యాన్స్ షాక్ ఇస్తోంది. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ హీట్ పుట్టిస్తోంది. ఆ అమ్మడు ఎవరో కాదు అందాల భామ కీర్తి సురేష్(Keerthy Suresh). రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ్మ కీర్తిసురేష్. తొలి సినిమాతోనే క్యూట్ గా అమాయకంగా కనిపించి కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది ఈ వయ్యారి భామ. ఇదిలా ఉంటే మొదటి నుంచి కీర్తి గ్లామర్ షోకి దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఈ మధ్య మాత్రం అందాలతో రెచ్చిపోతోంది. రీసెంట్ గా వచ్చిన మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో కాస్త అందాలు ఒలకబోసి ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ సుందరి. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎల్లో కలర్ కోటు ధరించి అందాలు ఆరబోసింది కీర్తి. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోసుతున్నాయి. కీర్తి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన దసరా, మెగాస్టార్ నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో చిరు చెల్లెలిగా నటిస్తోంది. అలాగే ఓ మలయాళ సినిమా, తమిళ్ సినిమా చేస్తోంది.