Keerthy Suresh: నేను శైలజ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది అందాల భామ కీర్తిసురేష్. మొదటి సినిమాతోనే తన క్యూట్ ఎక్స్ప్రెషన్‌తో కుర్రాళ్లను కట్టిపడేసింది. నేను శైలజ సినిమా తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది కీర్తి. ఓవైపు తెలుగు సినిమాలతోపాటు తమిళ్ సినిమాల్లోనూ నటిస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో కీర్తి స్టార్ హీరోయిన్‌గా కంటిన్యూ అవుతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి సినిమాతో ఒక్కసారిగా జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి. మహానటి సినిమా తర్వాత ఆచితూచి సినిమాలను ఎంచుకుంటుంది. ఆ మధ్య వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది ఈ చిన్నది. లాక్ డౌన్ సమయంలో గ్యాప్ లేకుండా రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది కీర్తి.
ముందుగా పెంగ్విన్ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో నటించింది. ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేశారు. ఈ సినిమా తర్వాత మిస్ ఇండియా అనే సినిమా చేసింది కీర్తిసురేష్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇక ఇప్పుడు గుడ్ లక్ సఖి అనే సినిమాతో రాబోతుంది. అయితే గుడ్ లక్ సఖి సినిమా ఎప్పటినుంచో రిలీజ్ కు నోచుకోక పెండింగ్ లో ఉంది. ఈ క్రమంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తనకు అచ్చి రావడంలేదని భావించిన మహానటి.. కొన్ని సంవత్సరాలవరకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తోందట. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది కీర్తి. అలాగే నాని నటిస్తున్న వైవిధ్యమైన మూవీ దసరాలో నటిస్తుంది కీర్తిసురేష్. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తే, సాని కాయధమ్, మెగాస్టార్ భోళాశంకర్ వంటి సినిమాలలో చెల్లెలి పాత్రలు కూడా చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :