Maha Kumbh Mela: మహా కుంభమేళాలో మల్లీశ్వరి.. సాధువుల దీవెనలు అందుకున్న కత్రినా కైఫ్.. ఫొటోస్ ఇదిగో

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తోంది. ఈ క్రమంలో అతని భార్య, స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మహా కుంభమేళాను దర్శించుకుంది. తన అత్తగారితో కలిసి ప్రయాగ్‌రాజ్‌లోని సాధువుల ఆశీర్వచనాలను తీసుకుంది.

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో మల్లీశ్వరి.. సాధువుల దీవెనలు అందుకున్న కత్రినా కైఫ్.. ఫొటోస్ ఇదిగో
Maha Kumbh Mela

Updated on: Feb 24, 2025 | 3:12 PM

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ‘చావా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా గురించి అన్ని చోట్లా చాలా చర్చ జరుగుతోంది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ నటనా నైపుణ్యాన్ని ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు. కాగా ఛావా సినిమా థియేటర్లలో విడుదల కాకముందే, విక్కీ ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభామేళాకు వెళ్లాడు. అక్కడ త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించాడు. ఇప్పుడు ‘ఛావా’ చిత్రం సూపర్‌హిట్ కావడంతో అతని భార్య, నటి కత్రినా కైఫ్ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లింది. తన అత్తగారితో కలిసి మహా కుంభమేళాను దర్శించుకుంది. ప్రస్తుతం కత్రినాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఈ సందర్భంగా కత్రినా సంప్రదాయ పంజాబీ సూట్ ధరించింది. కాగా సంగమంలో పవిత్ర స్నానం చేసే ముందు, కత్రినా, ఆమె అత్తగారు అక్కడి సాధువుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సాధువులు కత్రినా మెడలో దండ వేసి స్వాగతం పలికారు. మహాకుంభ్‌లోని సాధువులు కూడా కత్రినాతో సంభాషించారు.

కాగా కత్రినా తరచుగా విక్కీ కుటుంబంతో కలిసి ప్రముఖ పుణ్య క్షేత్రాలను సందర్శిస్తుంది. కొన్ని రోజుల క్రితం ఆమె తన అత్తగారిని తీసుకుని సాయిబాబాను సందర్శించడానికి షిర్డీకి వెళ్లింది. కాగా విక్కీ తన భార్య, తల్లిదండ్రులతో కలిసి ‘చావా’ సినిమా ప్రీమియర్‌కి వచ్చాడు. ఆ సినిమా చూసిన తర్వాత విక్కీ తల్లిదండ్రులు గర్వంతో నిండిపోయారు. కత్రినా కూడా విక్కీ నటనను ప్రశంసించింది. ‘ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథను ఈ చిత్రంలో ఎంతో గొప్పగా చిత్రీకరించారు. లక్ష్మణ్ ఉటేకర్ తెరపై కథలను చాలా చక్కగా చెబుతాడు. ఈ సినిమా చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. చివరి నలభై నిమిషాలు అయితే సూపర్బ్. ఈ సినిమా నాపై చూపిన ప్రభావాన్ని మాటల్లో చెప్పలేను. విక్కీ కౌశల్.. నువ్వు నిజంగా గొప్ప నటుడు. మీరు తెరపై చేసే అద్భుతంగా నటించారు. నీ ప్రతిభను చూసి నేను చాలా గర్వపడుతున్నాను’ అని కత్రినా భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది.

ఇవి కూడా చదవండి

మహా కుంభమేళాలో కత్రినా కైఫ్..

‘ఛావా’ చిత్రం 300 కోట్ల మార్కును దాటింది. విక్కీతో పాటు, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, సంతోష్ జువేకర్, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్ కూడా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.