AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరు గెటప్స్‌లో అదరగొట్టాడానికి రెడీ అవుతోన్న కార్తీ.. సర్ధార్ రిలీజ్ అయ్యేది అప్పుడే

యముగానికొక్కడే, ఆవారా, నా పేరు శివ, ఖాకీ, ఖైదీ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు కార్తీ. అలాగే వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఊపిరి సినిమాతో స్ట్రయిట్ తెలుగు సినిమాతోనూ..

ఆరు గెటప్స్‌లో అదరగొట్టాడానికి రెడీ అవుతోన్న కార్తీ.. సర్ధార్ రిలీజ్ అయ్యేది అప్పుడే
Karthi Sardar
Rajeev Rayala
|

Updated on: Oct 19, 2022 | 11:32 AM

Share

తమిళ్ స్టార్ హీరోల్లో కార్తీ ఒకరు. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. యుగానికొక్కడే, ఆవారా, నా పేరు శివ, ఖాకీ, ఖైదీ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు కార్తీ. అలాగే వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఊపిరి సినిమాతో స్ట్రయిట్ తెలుగు సినిమాతోనూ ఆకట్టుకున్నారు. ఇక కార్తీ అన్న సూర్య మాదిరిగానే హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాలో కార్తీ నటించాడు. ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు తెలుగు, తమిళ్ భాషల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా సర్దార్.

ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ‘సర్దార్’ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తోంది. సర్దార్‌లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుండగా, రజిషా విజయన్, చుంకీ పాండే కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇటివలే విడుదలైన ‘సర్దార్’ టీజ‌ర్‌ కి అన్ని వర్గాల ప్రేక్షల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్‌లో కార్తీ ఆరు విభిన్న గెటప్స్ , బ్రిలియంట్ ఫెర్ ఫార్మెన్స్, వైవిధ్యమైన కథ సినిమాపై భారీ అంచనాలని పెంచింది. పిఎస్ మిత్రన్ తన అవుట్ స్టాండింగ్ తో ఆకట్టుకున్నారు.

భారీ నిర్మాణ విలువలు వున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..సర్దార్ 2022 దీపావళికి తెలుగు, తమిళంలో థియేట్రికల్ విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుండటంతో సహజంగానే ఈ చిత్రం తెలుగులో భారీ సంఖ్యలో గ్రాండ్ గా థియేటర్ లో విడుదలౌతుంది. మరి ఈ సినిమాలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మీ చెవుల ఆకారమే.. మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని తెలుసా?
మీ చెవుల ఆకారమే.. మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని తెలుసా?
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
అద్భుతం.. మహా అద్భుతం.. ఇంట్లో వెలసిన మంచు శివలింగం!
అద్భుతం.. మహా అద్భుతం.. ఇంట్లో వెలసిన మంచు శివలింగం!
డ్వాక్రా సంఘంలో ఎలా చేరాలి? అర్హతలు ఏంటి..?
డ్వాక్రా సంఘంలో ఎలా చేరాలి? అర్హతలు ఏంటి..?
గుప్త నవరాత్రుల్లో ఈ వస్తువులను దానం చేయండి.. అమ్మవారి అనుగ్రహంతో
గుప్త నవరాత్రుల్లో ఈ వస్తువులను దానం చేయండి.. అమ్మవారి అనుగ్రహంతో
‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. తెగ సంబరపడుతున్న మగానుభావులు
‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. తెగ సంబరపడుతున్న మగానుభావులు
మ్యాచ్ మధ్యలో బాంబ్ పేల్చిన గంభీర్.. కోహ్లీతోపాటు రోహిత్ ఎమోషన్
మ్యాచ్ మధ్యలో బాంబ్ పేల్చిన గంభీర్.. కోహ్లీతోపాటు రోహిత్ ఎమోషన్
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..