Sardar: ఓటీటీకి రెడీ అయిన కార్తీ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. సర్దార్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ అంటే..

|

Nov 11, 2022 | 6:08 PM

యుగానికొక్కడు , ఆవారా, ఖాకీ, ఖైదీ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న కార్తీ. ఇక కార్తీ అన్న సూర్య మాదిరిగానే హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆకట్టుకుంటున్నారు.

Sardar: ఓటీటీకి రెడీ అయిన కార్తీ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. సర్దార్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ అంటే..
Sardar
Follow us on

తమిళ్ హీరో కార్తీకి మన దగ్గర కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కార్తీ నటించిన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నాయి. యుగానికొక్కడు , ఆవారా, ఖాకీ, ఖైదీ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న కార్తీ. ఇక కార్తీ అన్న సూర్య మాదిరిగానే హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆకట్టుకుంటున్నారు. రీసెట్ గా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్స్ సెల్వన్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కార్తీ తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే లేటెస్ట్ గా సర్దార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తీ. అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌-కార్తి కాంబినేషన్ లో వచ్చిన సినిమా సర్దార్. ఈ సినిమాకు థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.

ఇక ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతోంది సర్దార్. ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్టీమింగ్ కానుంది. నవంబర్ 18న సర్ధార్ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు ఆహా టీమ్. అక్టోబర్ 21న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాలో కార్తీ సరసన రాశీఖ‌న్నా, ర‌జిష విజ‌య‌న్‌, లైలా నటించారు.

కార్తీ ఆరు విభిన్న గెటప్స్, బ్రిలియంట్ ఫెర్ ఫార్మెన్స్, వైవిధ్యమైన కథ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ‘సర్దార్’ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసింది. ఇక ఈ సినిమా ఓటీటీలో ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి