Rashmika Mandanna: రష్మికాకు తగిన గుణపాఠం నేర్పాలి.. నేషనల్ క్రష్ పై మండిపడ్డ ఎమ్మెల్యే
స్టార్ హీరోయిన్ రష్మిక టాలీవుడ్ బాలీవుడ్ అని తేడాలు లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. హీరోలకు మించిన క్రేజ్ తో ఈ అమ్మడు రాణిస్తుంది. చాలా తక్కువ సమయంలోనే క్లిక్ అయిన రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. కన్నడ ఇండస్ట్రీలో కిరాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ వయ్యారి..

ఇప్పుడు ఎక్కడ చూసిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరే వినిపిస్తుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. రీసెంట్ గా పుష్ప సినిమాతో, ఛావా సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అలాగే ఈ చిన్నది ఇప్పుడు బడా హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది. ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ సినిమాలో నటిస్తుంది. తాజాగా రష్మిక మందన్న పై ఓ ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. రష్మికకు గుణపాఠం చెప్పాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో తోపు హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోల సినిమాలు చేసి స్టార్ డమ్ తెచ్చుకుంది. అలాగే పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. పుష్ప సినిమాతో భారీ హిట్ అందుకుంది ఈ అమ్మడు. రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో రష్మిక పేరు మారుమ్రోగింది. ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.
తాజాగా కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ రష్మిక మందన్న పై ఫైర్ అయ్యారు. రష్మిక బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు అంగీకరించలేదని అన్నారు. ఆమెకి కెరీర్ ఇచ్చిన ఇండస్ట్రీని ఆమె గౌరవం ఇవ్వడం లేదు. రష్మికాకు తగిన గుణపాఠం చెప్పాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ సినిమాతో ఈ రాష్ట్రంలోనే తన కెరీర్‌నుప్రారంభించింది హీరోయిన్ రష్మిక. రష్మికాను బెంగుళూరు లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు కావాలని కోరుతూ ఎన్నోసార్లు రష్మికాను సంప్రదించాం. కానీ ఆమె అందుకు ఒప్పుకోవడం లేదు. నాకు కర్ణాటకు వచ్చే సమయం లేదు.. నా ఇల్లు హైదరాబాద్ లో ఉంది అని అంటుంది. అంతే కాదు కర్ణాటక ఎక్కడో కూడా నాకు తెలియదు అన్నట్లు ఆమె మాట్లాడింది అని మండిపడింది. మా వాళ్ళు ఆమెను పదిసార్లు కలిసి హాజరుకావాలని రిక్వెస్ట్ చేశారు. కన్నడ ఇండస్ట్రీ, కన్నడ భాష పట్ల ఆమె అగౌరవంగా వ్యవహరిస్తున్నారు. ఆమెకు సరైన పాఠం నేర్పించాల్సిన అవసరం లేదా.? అని ఎమ్మెల్యే రవి గనిగ అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.