AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunita Williams: 45 రోజుల పాటు నాసా సెంటర్‌లో సునీత విలియమ్స్‌.. ఎందుకో తెలుసా?

Sunita Williams: సుదీర్ఘకాలం అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ విజయవంతంగా ప్రయోగించబడిన తర్వాత, నాసా క్రూ-9 వ్యోమగాములు సునీతా విలియమ్స్, నిక్ హేగ్, బుచ్ విల్మోర్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఈ ఉదయం తొమ్మిది నెలలకు పైగా భూమి గాలిని పీల్చుకున్నారు..

Sunita Williams: 45 రోజుల పాటు నాసా సెంటర్‌లో సునీత విలియమ్స్‌.. ఎందుకో తెలుసా?
Subhash Goud
|

Updated on: Mar 19, 2025 | 11:54 AM

Share

Sunita Williams: సుదీర్ఘకాలం అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ విజయవంతంగా ప్రయోగించబడిన తర్వాత, నాసా క్రూ-9 వ్యోమగాములు సునీతా విలియమ్స్, నిక్ హేగ్, బుచ్ విల్మోర్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఈ ఉదయం తొమ్మిది నెలలకు పైగా భూమి గాలిని పీల్చుకున్నారు. వ్యోమగాములను స్ట్రెచర్లపై క్యాప్సూల్ నుండి బయటకు తీశారు. సునీత విలియమ్స్‌ ఈ 45 రోజులు నాసా సెంటర్‌లోనే ఉంటారు. వారిని వైద్యులు, మానసిక నిపుణుల పర్యవేక్షణలో ఉంచుతారు. రోజుకు రెండు గంటల చొప్పున ఈ 45 రోజుల పాటు వివిధ వ్యాయామాలు చేయిస్తారు. అనుక్షణం వారిని మానిటరింగ్‌ చేస్తారు అధికారులు. అయితే ఈ 45 రోజులు ఏం జరుగుతుంది?

శరీర సామర్థ్యం, కండరాల, ఎముకల బలం పెపొందించడం కోసం వ్యాయామాలు చేయిస్తారు. శక్తి, ఓర్పు, సమతుల్యత, చురుకుదనం పెంచడం కోసం మానసిక వ్యాయామాలు కూడా ఉంటాయి. ఇక సమన్వయం, ఆర్థోస్టాటిక్‌ టాలరెన్స్‌ వంటి విషయాలపై ట్రెయినింగ్‌ ఉంటుంది. ఈ మొత్తం ట్రెయినింగ్‌ మూడు ఫేజ్‌లుగా అందిస్తారు.

ఫేజ్‌1 – ఈరోజు నుంచే ప్రారంభం అవుతుంది. ఇందులో ఫ్లెక్సిబిలిటీ, కండరాల బలోపేతంపై దృష్టి పెడతారు.

ఫేజ్‌2 ప్రొప్రియోసెప్టివ్‌ వ్యాయామాలు అంటే.. శరీర సామర్థ్యంతోపాటు.. హృదయనాళాల సామర్థ్యం పెంచే వ్యాయామాలు ఉంటాయి.

జ్‌3 లో క్రియాత్మక అభివృద్ధిపై దృష్టి పెడతారు. ప్రతీరోజు 2 గంటల పాటు 45రోజుల ట్రెయినింగ్‌ ఉంటుంది. శరీరం మళ్లీ గురుత్వాకర్షణకు అలవాటు పడేందుకు కృషిచేస్తారు డాక్టర్లు.

దాదాపు 9నెలల తర్వాత భూమ్మీదకు వచ్చారు సునీత విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌. వీరికి ఎన్నోరకాల శారీరక, మానసిక ఇబ్బందులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీరు నడవడానికి ఇబ్బంది పడడం, చూపులను స్థిరీకరించలేకపోవడం, కళ్లు తిరగడం, వాంతులు చేసుకోవడం.. శరీరంలో రేడియేషన్‌ స్థాయిలు ఎక్కువగా ఉండడం, ఎముకల సాంద్రత తగ్గడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారని చెబుతున్నారు.

వ్యోమగాములు నెలకు 1% ఎముక సాంద్రతని కోల్పోతారు. ముఖ్యంగా దిగువ వెన్నెముక, తుంటి, తొడ ఎముకలలో, తిరిగి వచ్చినప్పుడు పగుళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీనిని ఎదుర్కోవడానికి, వారు కఠినమైన వ్యాయామ దినచర్యను అనుసరిస్తారు. వ్యోమగాముల వెన్నెముక పొడవుగా మారుతున్న కొద్దీ అంతరిక్షంలో రెండు అంగుళాల పొడవు కూడా పెరుగుతారు. అయితే, వారు భూమికి తిరిగి వచ్చిన తర్వాత ఈ తాత్కాలిక ఎత్తు పెరుగుదల ఉండదు. వెన్నెముక తిరిగి సర్దుబాటు అవుతున్న కొద్దీ తరచుగా వెన్నునొప్పి వస్తుంది. వ్యోమగాములు నడవడానికి బదులుగా తేలుతూ ఉండటం వలన, వారి పాదాలు తక్కువ ఘర్షణ లేదా ఒత్తిడిని అనుభవిస్తాయి.ఫలితంగా వారి పాదాల చర్మం సున్నితంగా మారి, “శిశువు పాదాలు” లాగా తయారవుతాయి. పాదాల మసాజ్‌లు పొందడం, కండరాలు, చర్మాన్ని వ్యాయామాల ద్వారా బలోపేతం చేస్తారు. భూమిపై, గురుత్వాకర్షణ శక్తి వల్ల.. రక్తం, నీరు వంటి శరీర ద్రవాలను క్రిందికి లాగి, వాటిని సమానంగా పంపిణీ చేస్తుంది. అయితే, అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. దీని వలన ద్రవాలు తల వైపు పైకి మారుతాయి. దీంతో ముఖం వాచినట్లు కనపడడం.. కాళ్లు సన్నగా అవడం జరుగుతాయి. దీన్నే పఫీ హెడ్‌, చికెన్‌ లెగ్స్‌ సిండ్రోమ్‌ అంటారు. వీటి నుంచి కోలుకునేందుకు 45 రోజుల పునరావాసం ఉంటుంది.

ఇది కూడా చదవండి: Sunita Williams: సముద్రంలో సునీత విలియమ్స్‌కు స్వాగతం పలికిన డాల్ఫిన్స్.. వీడియో వైరల్‌

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి