Devi Sri Prasad: దేవిశ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి… కారణం ఏంటంటే

ఆమె తోపాటు పలు హిందు సంఘాలు కూడా దేవీశ్రీ పై ఫిర్యాదు చేశాయి. దానికి కారణం ఏంటంటే దేవి శ్రీ కంపోజ్ చేసిన ఓ పారి అనే ఆల్బమ్ లో హరే రామ , హరే కృష్ణ మంత్రాన్నివాడారు.

Devi Sri Prasad: దేవిశ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి... కారణం ఏంటంటే
Karate Kalyani Devi Sri Prasad

Updated on: Nov 02, 2022 | 6:45 PM

టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు నమోదైంది. సినీ నటి కరాటే కళ్యాణి దేవిశ్రీ ప్రసాద్ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు. ఆమె తోపాటు పలు హిందు సంఘాలు కూడా దేవీశ్రీ పై ఫిర్యాదు చేశాయి. దానికి కారణం ఏంటంటే దేవి శ్రీ కంపోజ్ చేసిన ఓ పారి అనే ఆల్బమ్ లో హరే రామ , హరే కృష్ణ మంత్రాన్నివాడారు. అయితే ఆ పాట ఐటెం సాంగ్ అని ఆ పాటలో హరే రామ హరే కృష మంత్రం ఎలా వాడుతారని దేవీ పై కంప్లెయింట్ చేశారు కరాటే కళ్యాణి.

ఓ పారి అనే ఆల్బమ్ లో హరే రామ , హరే కృష్ణ మంత్రాన్ని ఐటెం సాంగ్ లో చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్న కరాటే కల్యాణి..పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రం పై అశ్లిల దుస్తువులు , నృత్యాలతో పాటను చిత్రీకరించిన దేవి శ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలి అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన దేవిశ్రీ ప్రసాద్ హిందు సమాజానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలిగించాలని… లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కరాటే కల్యాణి వార్నింగ్ ఇచ్చారు. మరి దీని పై దేవీ శ్రీ ప్రసాద్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Karate Kalyani

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి