Kannappa Movie: కేదారేశ్వరుడిని దర్శించుకున్న కన్నప్ప టీమ్.. వీడియో చూడండి
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ షూటింగ్ శర వేగంగా సాగుతోంది. అదే సమయంలో ప్రమోషన్లు కూడా ఉపందుకున్నాయి. గ్యాప్ లేకుండా సినిమాలోని ఆర్టిస్టుల లుక్స్ ను రివీల్ చేస్తూ వరుసగా పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగానే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని కన్నప్ప టీమ్ నిర్ణయించుకుంది.
మంచు వారబ్బాయి విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో ప్రభాస్ శివుడిగా నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమారో మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. వీరితో పాటు ర్, ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా తదితరులు వివిధ పాత్రల్లో మెరవనున్నారు. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. ఇదిలా ఉంటే కన్నప్ప టీమ్ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శంచుకోవాలని నిర్ణయించుకుంది.ఇందులో భాగంగా మంచువిష్ణు, మోహన్ బాబుతో సహా పలువురు చిత్రబృంద సభ్యులు బద్రినాథ్, కేదార్‌నాథ్ ఆలయాలను దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శివుని పరమ భక్తుడైన కన్నప్ప మూవీ సక్సెస్ కావాలని కేదారాశ్వరుని ఆశీస్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
’12 జ్యోతిర్లింగాల యాత్రను ప్రారంభించాను. ఇందులో భాగంగా పవిత్ర కేదార్‌నాథ్ క్షేత్రాన్ని దర్శించుకున్నాం. అలాగే కన్నప్ప సినిమా కోసం అది చేయబోయే ప్రయాణం కోసం ప్రార్థించాం’ అని తన కేదార్ నాథ్ పర్యటన విశేషాలను సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు మంచు విష్ణు. ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు మోహన్ బాబు. ఈ మూవీ షూటింగ్ న్యూజిలాండ్ లోని అందమైన లోకేషన్లలో జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.
కేదార్ నాథ్ ఆలయంలో మోహన్ బాబు, మంచు విష్ణు.. వీడియో ఇదిగో..
Seeking blessings for an epic tale! @ivishnumanchu and team Kannappa’s sacred journey to #Kedarnathॐ and #Badrinathॐ. #HarHarMahadevॐ@themohanbabu @mukeshvachan @arpitranka_30#Kannappa🏹 #FaithAndCourage #SpiritualJourney pic.twitter.com/zVg8RfcOc0
— Kannappa The Movie (@kannappamovie) October 25, 2024
కన్నప్ప సినిమాలో బ్రహ్మానందం..
Introducing the power-house of talent, the King of Comedy #Brahmanandam as #Pilaka & joining him is the talented @MeSapthagiri as #Gilaka; they portray the gurus of wisdom, wit & skills to teach the forests in the world of #Kannappa🏹#HarHarMahadevॐ@themohanbabu… pic.twitter.com/hW6pqh0C6m
— Kannappa The Movie (@kannappamovie) September 30, 2024