Actress Shobitha: బుల్లితెర నటి శోభిత పోస్టుమార్టం పూర్తి.. డాక్టర్స్ ఏం చెప్పారంటే..
కన్నడ బుల్లితెర నటి శోభిత శివన్న ఆదివారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది పెళ్లి చేసుకున్న శోభిత.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాను నివాసముంటున్న ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది.
బుల్లితెర నటి శోభిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు వైద్యులు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోలీసులు శోభిత కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆమె స్వస్థలం కర్ణాటక కావడంతో అక్కడికే ఆమె మృతదేహాన్ని తరలించనున్నారు కుటుంబీకులు. అయితే శోభిత పోస్టుమార్టం నివేదికలో పలు కీలక అంశాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె మరణాన్ని వైద్యులు ఆత్మహత్యగానే నిర్దారించారు. ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని నివేదికలో స్పష్టం చేశారు. ఈరోజు శోభిత అంత్యక్రియలు ఆమె స్వగ్రామంలో జరగనున్నట్లు తెలుస్తోంది.
కన్నడ బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి శోభిత. అలాగే తెలుగులో సీరియల్స్, కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్ రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుంది శోభిత. పెళ్లికి ముందు బెంగుళూరులో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న సుధీర్.. వివాహం తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. ప్రస్తుతం వీరిద్దరూ గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సీ బ్లాక్ లో నివాసముంటున్నారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న శోభిత.. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
ఇప్పటికే ఆ గదిలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. అందులో ‘యు కెన్ డూ ఇట్ ‘ అంటూ పేర్కొంది. దీంతో ఆమె ఎవరిని ఉద్దేశించి రాసింది అనేది మాత్రం తెలియరాలేదు. శోభిత సూసైడ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆత్మహత్యకు డిప్రెషన్ కారణామా.. ? లేదా మరెదైనా కారణం ఉందా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.