Ghost: నాగ్ వర్సెస్ శివరాజ్ కుమార్.. ఘోస్ట్ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..

|

Jul 12, 2022 | 3:04 PM

కన్నడిగులు ఎంతో అభిమానించే ఈ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఘోస్ట్. ఇందులో అన్ని భాషల నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Ghost:  నాగ్ వర్సెస్ శివరాజ్ కుమార్.. ఘోస్ట్ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
Ghost
Follow us on

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivarajkumar) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్‏కు భారీగానే ఫాలోయింగ్ ఉంది. కన్నడిగులు ఎంతో అభిమానించే ఈ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఘోస్ట్. ఇందులో అన్ని భాషల నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ బ్లాక్ బస్టర్ ‘బీర్బల్’ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

‘ఘోస్ట్’ చిత్రం ఎంతో ఆసక్తికరమైన యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ జానర్ లో రూపొందనుంది. కన్నడ లో ఇలాంటి తరహా చిత్రం వచ్చి చాల కలం అవడం శివరాజ్ కుమార్ ని ఈ చిత్రం చేసేలా ఇన్స్పైర్ చేసింది. ఈ చిత్ర క్లైమాక్స్, ఎంతో కొత్త తరహాలో సాగే స్క్రీన్ ప్లే ఆయనకీ ఎంతగానో నచ్చాయి. ఈ కథ లో మెయిన్ థీమ్ భాషలకి సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని అయిదు భాషల్లో తీస్తున్నారు. కింగ్ అఫ్ అల్ మాసెస్ Dr శివరాజ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు (జులై 12) బాదుషా కిచ్చా సుదీప ఘోస్ట్ ఫస్ట్ పోస్టర్ విడుదల చేసి శివరాజ్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పోస్టర్ డిజైన్ చిత్రం మీద ఆసక్తి మరింత పెంచేలా ఉంది. గన్ పట్టుకుని తీక్షణంగా చూస్తున్న శివరాజ్ కుమార్ లుక్ ఇది యాక్షన్ చిత్రం అని సూచిస్తోంది. అలాగే రివాల్వర్ కార్ కలిపి చేసిన డిజైన్ ఇది హైస్ట్ ఫిలిం అని హింట్ ఇస్తోంది. సెర్చ్ లైట్, బైకర్స్, కార్స్, గన్స్… వీటితో డిజైన్ చేసిన పోస్టర్ డిటైలింగ్ చాలా బాగుంది. ఘోస్ట్ ఫస్ట్ పోస్టర్ చిత్రం మీద అంచనాలు పెంచడం తో పాటు ఇది ఏ తరహా చిత్రమో ప్రేక్షకులు ఒక అంచనాకి వచ్చేలా చేయడంలో సక్సెస్ అయింది. ఇక ఇదే టైటిల్‏తో అక్కినేని నాగార్జున సైతం రాబోతున్నారు. ఇటీవల విడుదలైన విజువల్ ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఒకే టైటిల్‏తో ఇద్దరు స్టార్ హీరోస్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.