Chandramukhi 2: చంద్రముఖి 2లో బాలీవుడ్ క్వీన్.. ఆ పాత్రలో కనిపించనున్న కంగనా రనౌత్ ?..

|

Nov 23, 2022 | 9:34 AM

ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. లారెన్స్ కథానాయకుడిగా రాబోతున్న ఈ సినిమాకు చంద్రముఖి డైరెక్టర్ పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు.

Chandramukhi 2: చంద్రముఖి 2లో బాలీవుడ్ క్వీన్.. ఆ పాత్రలో కనిపించనున్న కంగనా రనౌత్ ?..
Kangana Ranaut
Follow us on

సూపర్ స్టార్ రజినీ కాంత్.. నయనతార ప్రధాన పాత్రలో నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ మూవీ బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తుంది. ఇందులో జ్యోతిక నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. లారెన్స్ కథానాయకుడిగా రాబోతున్న ఈ సినిమాకు చంద్రముఖి డైరెక్టర్ పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‏లో జరుగుతుంది. అంతకు ముందు మైసూర్ లో జరిగిన చిత్రీకరణలో లారెన్స్, రాధికలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ మూవీలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కీలకాపాత్రలో నటించనుందట. ఆమె ఈ సినిమాలో ముఖ్య పాత్రను పోషించనుందని సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ బిజీగా ఉంటుంది కంగనా.. కేవలం సినిమాలతో నే కాకుండా వివాదస్పద వ్యాఖ్యలతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది.

ఇవి కూడా చదవండి

చంద్ర‌ముఖి2 లో ల‌క్ష్మీ మీన‌న్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో క‌నిపించ‌బోతుంది. హార్రర్ జోన‌ర్‌లో వ‌చ్చి బ్లాక్ బాస్ట‌ర్ హిట్టుగా నిలిచిన చంద్ర‌ముఖికి సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఫ‌స్ట్ పార్టు చంద్ర‌ముఖిలో కామెడీ టైమింగ్‌తో అంద‌రినీ న‌వ్వించిన లెజెండ‌రీ కమెడియ‌న్ వ‌డివేలు సీక్వెల్‌లో కూడా సంద‌డి చేయ‌బోతున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుద‌లైన పోస్టర్లు సినిమాపై విప‌రీత‌మైన క్యూరియాసిటీని పెంచాయి.