Thalaivi Movie: ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లోనే కంగనా సినిమా.. క్లారిటీ ఇచ్చిన తలైవి మూవీ మేకర్స్..

బాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం తలైవి . దివంగత నటి ,రాజకీయనాయకురాలు జయలలిత జీవిత కథ ఆధారంగా ..

Thalaivi Movie: ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లోనే కంగనా సినిమా.. క్లారిటీ ఇచ్చిన తలైవి మూవీ మేకర్స్..
Image Source - Kangana Ranaut/ Twitter

Updated on: Jun 04, 2021 | 8:30 AM

Thalaivi Movie: బాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం తలైవి . దివంగత నటి ,రాజకీయనాయకురాలు జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంగన జయలలిత పాత్రలో కనిపించనుంది. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రల్లో నటిస్తుండగా.. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచేసింది. తెలుగు తమిళం కన్నడ భాషల్లో 140 పైగా సినిమాల్లో కథానాయికగా విభిన్న పాత్రలు  పోషించారు జయలలిత. ఈ సినిమా ట్రైలర్ తో ప్రేక్షకులలో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అదే విధంగా ఏప్రిల్ 23న రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించింది చిత్రబృందం. కానీ కోవిడ్ వలన సినిమా వాయిదా పడటంతో తలైవి రిలీజ్ పై  వినిపిస్తున్నాయి.

‘మణికర్ణిక’ వంటి హిస్టారికల్ మూవీ తర్వాత కంగనా నటించిన బయోపిక్ ఇదే. ఈ మూవీని విబ్రీ మీడియా పతాకంపై విష్ణు వర్థన్ ఇందూరి నిర్మిస్తున్నారు. జయలలిత జీవితంలోని ప్రధాన అంశాలు ఈ సినిమాలో ఉంటాయట. జయలలిత పదహారేళ్ల వయసు నుండి  60 ఏళ్ల వయసు వరకూ మొత్తం నాలుగు దశలను తలైవి బయోపిక్ లో చూపించనున్నారు. కరోనా తగ్గిన వెంటనే అంటే థియేటర్స్ తెరచుకోగానే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. జులై చివరి వారంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

మరిన్ని ఇక్కడ చదవండి ;

S P Balasubrahmanyam Birthday : తన గాత్రంతో వెలది పాటలకు ఊపిరి పోసిన గానగంధర్వుడు.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

Mahesh Babu: తన గారాలపట్టీల ప్రేమగా హత్తుకుని హాయిగా నిద్రిస్తున్న సూపర్ స్టార్.. వైరల్ గా మారిన మహేష్ బాబు సితార ఫోటో…