
ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్ కంగనా రనౌత్. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మకు యూత్ లో ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించిన ఆమె.. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే ముక్కుసూటిగా మాట్లాడుతూ హాట్ టాపిక్ అయ్యింది. ప్రొడ్యుసర్స్, స్టార్స్ బిహెవియర్స్ గురించి ఆమె చేసిన కామెంట్స్ అప్పట్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అటు సినిమాలు.. ఇటు రాజకీయాల్లో బిజీగా ఉంది. అయితే ఇటీవల ఆమె మెడలో మంగళసూత్రంతో కనిపించి హడావిడిగా కారు ఎక్కుతున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో కంగనా రహస్యంగా పెళ్లి చేసుకున్నారా ? సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది.
ఎక్కువ మంది చదివినవి : Actress : ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది.. ఇప్పుడు ఇలా..
తాజాగా ఆ ఫోటోస్, వీడియోస్ పై కంగనా తన ఇన్ స్టోరీలో స్పందించింది. ” నేను చేస్తున్న క్యారెక్టర్ మేకప్ లో ఉన్నప్పుడే ఎవరో నా ఫోటో తీశారు. ఇప్పుడు నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. పెళ్లి చేసుకున్న మహిళగా.. ఒక వివాహిత పాత్రలో కనిపించడంలో అంత పెద్ద విషయం ఏముంది ? సినిమాల్లో నటీనటులు అన్ని రకాల పాత్రలు పోషిస్తున్నారు. నేనేమి రహస్యంగా పెళ్లి చేసుకోను. ఇది నా ప్రామిస్” అంటూ రాసుకొచ్చారు. దీంతో కంగనా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Soundarya: సౌందర్య భర్త ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. హీరోయిన్ ప్రేమ కామెంట్స్..
కంగనా క్వీన్ మొదటి చిత్రంలో వివాహం క్యాన్సిల్ అయ్యి విదేశాలకు వెళ్లిన మహిళగా కనిపించింది. ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ లో వివాహిత స్త్రీగా కనిపించి ప్రేక్షకులను అలరించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన భారత భాగ్య విధాత చిత్రం వచ్చే నెల 12న రిలీజ్ కానుంది.
ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..
ఎక్కువ మంది చదివినవి : Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..