Chandramukhi 2: కంగనా ‘చంద్రముఖి 2’ వెనక్కుతగ్గింది ఇందుకేనా? ఆ స్టార్‌ హీరో కారణంగానే సినిమా రిలీజ్‌ వాయిదా!

|

Sep 09, 2023 | 6:52 PM

విభిన్న కథలతో సినిమాలు చేస్తూ బాలీవుడ్ క్వీన్‌గా వెలుగొందుతోంది హీరోయిన్‌ కంగనా రనౌత్. ఇప్పుడు 'చంద్రముఖి 2' సినిమాలో కూడా ఒక డిఫరెంట్ రోల్ చేసింది . అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 19న ఈ సినిమా విడుదల కావాల్సింది. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ వాయిదా పడింది. దీనికి కారణం సాంకేతిక సమస్యలేనని 'చంద్రముఖి 2' చిత్ర బృందం పేర్కొంది. అయితే అసలు కారణం వేరే ఉండవచ్చని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

Chandramukhi 2: కంగనా చంద్రముఖి 2 వెనక్కుతగ్గింది ఇందుకేనా? ఆ స్టార్‌ హీరో కారణంగానే సినిమా రిలీజ్‌ వాయిదా!
Chandramukhi 2 Movie
Follow us on

విభిన్న కథలతో సినిమాలు చేస్తూ బాలీవుడ్ క్వీన్‌గా వెలుగొందుతోంది హీరోయిన్‌ కంగనా రనౌత్. ఇప్పుడు ‘చంద్రముఖి 2’ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ రోల్ చేసింది . అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 19న ఈ సినిమా విడుదల కావాల్సింది. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ వాయిదా పడింది. దీనికి కారణం సాంకేతిక సమస్యలేనని ‘చంద్రముఖి 2’ చిత్ర బృందం పేర్కొంది. అయితే అసలు కారణం వేరే ఉండవచ్చని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘ జవాన్ ‘ కారణంగా ‘చంద్రముఖి 2’ వాయిదా పడిందని కొందరు చెబుతున్నారు. రెండు పెద్ద సినిమాలు ఒకేసారి థియేటర్లలో ప్రదర్శితమైతే, అందులో ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద నష్టపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం థియేటర్ల వద్ద ‘జవాన్’ సినిమా హవా కొనసాగిస్తుంది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా హైప్ మరిన్ని రోజులు కొనసాగనుంది. ఈ పరిస్థితుల్లో చంద్రముఖి 2 సినిమాను రిలీజ్‌ చేయడం సరైన నిర్ణయం కాదని దర్శక నిర్మాతలు భావించారని టాక్‌ నడుస్తోంది. అందుకే సెప్టెంబర్ 19న కాకుండా సెప్టెంబర్ 28న చంద్రముఖి 2 విడుదల చేయాలని వారు భావించారని తెలుస్తోంది. కాగా చంద్రముఖి సినిమాలో కంగనా రనౌత్‌తో పాటు రాఘవ లారెన్స్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, వడివేలు, రాధికా శరత్ కుమార్, సురేష్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

 థియేటర్లలో షారుక్ ఖాన్ జవాన్ జోరు..

‘లైకా ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై సుభాష్ కరణ్ ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని నిర్మించారు. పి.వాసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆస్కార్‌ విజేత ఎమ్ఎమ్‌ కీరవాణి సంగీతం సమకూర్చారు. రాజశేఖర్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, ఆంథోని ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తించారు. మరోవైపు ‘జవాన్’ సినిమా మూడ్ బలంగా ఉంది. ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.129.6 కోట్లు రాబట్టింది. ఇక రెండో రోజు కూడా ఏకంగా రూ. 113 కోట్లు రాబట్టి ఓవరాల్‌ గా 250 కోట్లకు సమీపంలో నిలిచింది. కంగనా రనౌత్‌ కూడా జవాన్‌ సినిమాపై ప్రశంసలు కురిపించడం విశేషం. ‘ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నప్పటికీ మరోసారి తమను తాము నిరూపించుకోవాలని కలలు కనే ఆర్టిస్టులందరికీ షారూఖ్ ఖాన్ రోల్ మోడల్. షారుఖ్ ఖాన్ సినిమా దేవుడు. కింగ్ ఖాన్‌ కు కంగ్రాట్స్‌’ అని కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో రాసుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి