Sarika: సారిక మాజీ భర్త స్టార్ హీరో, కూతురు స్టార్ హీరోయిన్… చేతిలో డబ్బులేక రూ. 3వేల కోసం థియేటర్‌లో పని..

కమల్ హాసన్ తో విడాకులు తీసుకున్న అనంతరం సారిక ముంబైకి షిఫ్ట్ అయ్యారు. అక్కడే నివసిస్తున్నారు. తాజాగా తాను డబ్బులు కోసం పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు సారిక. తన దగ్గర లాక్‌డౌన్ సమయంలో డబ్బు లేకుండా పోయిందని చెప్పారు.

Sarika: సారిక మాజీ భర్త స్టార్ హీరో, కూతురు స్టార్ హీరోయిన్... చేతిలో డబ్బులేక రూ. 3వేల కోసం థియేటర్‌లో పని..
Haasans Ex Wife Sarika
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: May 17, 2022 | 10:11 PM

Sarika: ఒకొక్కసారి విధి విచిత్రమనిపిస్తుంది. ఎంతటి గొప్పవారైనా.. దేశాన్ని ఏలిన రాజైనా.. సామాన్యుడిలా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు రాజకీయనేతలు, సినీ సెలబ్రెటీలు, క్రీడాకారులు ఎవరూ అతీతులు కారు. ఇందుకు ఉదాహరణగా తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఒకప్పుడు హీరోయిన్.. ఆమె పెళ్లి చేసుకుంది.. ఓ స్టార్ హీరోని.. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. ఆ కుమార్తెలు ఇద్దరు ఇప్పుడు వెండి తెరపై హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాలక్రమంలో భర్తతో ఆ నటి విడాకులు తీసుకుంది.. అయితే ఇప్పుడు కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. పూట గడపడానికి మూడు వేల రూపాయల కోసం పనిచేసినట్లు తెలిపింది. ఆమె ఎవరో కాదు.. లెజెండరీ హీరో కమల్ హాసన్ మాజీ భార్య.. నటి సారిక.

కమల్ హాసన్ తో విడాకులు తీసుకున్న అనంతరం సారిక ముంబైకి షిఫ్ట్ అయ్యారు. అక్కడే నివసిస్తున్నారు. తాజాగా తాను డబ్బులు కోసం పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు సారిక. తన దగ్గర లాక్‌డౌన్ సమయంలో డబ్బు లేకుండా పోయిందని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో పాండమిక్ రావడంతో సేవింగ్స్ పూర్తిగా అయిపోయాయని, దీంతో థియేటర్ ఆర్టిస్టులతో వర్క్ చేశానని తెలిపింది. కానీ వారు రూ. 2000 – రూ.2700 వరకు మాత్రమే చెల్లిస్తుండటంతో మళ్లీ సినిమాల్లో నటించడమే బెస్ట్ అని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సారిక అమెజాన్ ప్రైమ్(Amazon Prime) ‘మోడ్రన్ లవ్ ముంబై’ ఆంథాలజీలోని ‘మై బ్యూటిఫుల్ రింకిల్స్’ పార్ట్‌ లో నటించి.. తన నటనతో ప్రశంసలు అందుకుంటుంది.

రాజ్‌పుత్ సంతతికి చెందిన మహారాష్ట్ర కుటుంబంలో జన్మించిన సారిక చాలా చిన్న వయస్సులో తన తండ్రిని కోల్పోయింది. దీంతో సారిక తన కుటుంబానికి ఏకైక జీవనోపాధిగా మారింది. కేవలం 5 సంవత్సరాల వయస్సులో, సారిక చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో తన కెరీర్‌ను ప్రారంభించింది. 2000 సంవత్సరంలో, హే రామ్ చిత్రానికి గాను సారిక ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్‌గా జాతీయ అవార్డును గెలుచుకుంది.  2005లో  నటి పర్జానియా చిత్రంలో తన నటనకు ఉత్తమ నటిగా మరొక జాతీయ అవార్డును గెలుచుకుంది.

సారిక విశ్వనటుడు కమల్ హాసన్‌తో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత 1988లో పెళ్లి చేసుకున్నది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. శృతి హాసన్, అక్షర హాసన్‌ లు. అయితే, 16 ఏళ్ల పాటు కలిసి ఉన్న సారిక, కమల్ 2004లో విడాకులు తీసుకున్నారు. అనంతరం సారిక మళ్ళీ ముంబైకి చేరుకుంది. అక్కడ థియేటర్ డ్రామాస్ లో నటిస్తూ.. జీవిస్తోంది.

మరిన్నిఎంటర్టైన్‌మెంట్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.