క‌మ‌ల్ కు క‌రోనానా..? ఆయ‌న ఇచ్చిన క్లారిటీ ఏంటీ..?

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Mar 28, 2020 | 4:25 PM

లోక‌నాయ‌కుడు కమల్​ హాసన్​కు కరోనా వచ్చిందంటూ వదంతులు గుప్పుమ‌న్నాయి. ఆయ‌న ఇంటికి స్వీయ నిర్బంధం పోస్టర్ అంటించి ఉండ‌టం ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూర్చుంది. దీంతో క‌మ‌ల్ ఫ్యాన్స్ తెగ వ‌ర్రీ అయ్యారు. అయితే ఆయ‌న‌కు ఎటువంటి ప్రాబ్ల‌మ్ లేదు. సీనియ‌ర్ నటి గౌతమి, కమల్ హాసన్ కొంతకాలం స‌హజీవనం చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా ఈ జంట‌ విడిపోయారు. అయితే గ‌తంలో గౌతమి తన పాస్​పోర్ట్​లో కమల్ తో క‌లిసి […]

క‌మ‌ల్ కు క‌రోనానా..? ఆయ‌న ఇచ్చిన క్లారిటీ ఏంటీ..?

లోక‌నాయ‌కుడు కమల్​ హాసన్​కు కరోనా వచ్చిందంటూ వదంతులు గుప్పుమ‌న్నాయి. ఆయ‌న ఇంటికి స్వీయ నిర్బంధం పోస్టర్ అంటించి ఉండ‌టం ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూర్చుంది. దీంతో క‌మ‌ల్ ఫ్యాన్స్ తెగ వ‌ర్రీ అయ్యారు. అయితే ఆయ‌న‌కు ఎటువంటి ప్రాబ్ల‌మ్ లేదు.

సీనియ‌ర్ నటి గౌతమి, కమల్ హాసన్ కొంతకాలం స‌హజీవనం చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా ఈ జంట‌ విడిపోయారు. అయితే గ‌తంలో గౌతమి తన పాస్​పోర్ట్​లో కమల్ తో క‌లిసి ఉన్న ఇంటి అడ్రస్ ఇచ్చింది. ఆమె ఇటీవలే దుబాయ్ ప‌ర్య‌ట‌నకు వెళ్లివ‌చ్చిన నేప‌థ్యంలో గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ వారు విష‌యం తెలియ‌క‌ కమల్ ఇంటికి నోటీసులు అంటించారు. క్లారిటీ ఇవ్వ‌డంతో ఆ త‌ర్వాత వాటిని తొల‌గించారు.

వాటిని చూసిన‌ కొందరు కమల్​కు కరోనా సోకిందని.. ఆయ‌న్నిహోమ్ ఐసోలేషన్​లో ఉంచి చికిత్స అందిస్తున్న‌ట్లు రూమ‌ర్స్ సృష్టించారు. దీనిపై తాజాగా క‌మ‌ల్ స్పందించాడు. నాపై ప్రేమ చూపిస్తోన్న వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు. నా ఇంటికి ఉన్న క్వారంటైన్ నోటీసు చూసి నాకు కరోనా వచ్చిందని అనుకుంటున్నారు. కానీ కొన్ని సంవ‌త్స‌రాలుగా అక్కడ ఉండట్లేదు. మ‌క్క‌ల్ నీది మ‌య‌మ్ పార్టీ కార్య‌క‌లాపాలు అక్క‌డ్నుంచి జ‌రుగుతున్నాయి. ముందు జాగ్ర‌త్త‌గా నేను సోష‌ల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నాను. ప్ర‌జ‌లు కూడా పాటించాల‌ని కోరుకుంటున్నాను ” అంటూ కమల్ ఓ లెటర్ విడుదల చేశాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu